బన్నీ సినిమా పేరు.. అదేనా?

అస్స‌లు స‌మ‌యం లేదంటున్నాడు బ‌న్నీ. ఇక కొత్త సినిమా కోసం రంగంలోకి దిగ‌డ‌మే ఆల‌స్యం అన్న‌ట్టుగా ఉన్నాడు. అల వైకుంఠ‌పుర‌ములో స‌క్సెస్ సంబ‌రాల కోసం విశాఖ‌, తిరుప‌తి, క‌ర్ణాట‌క‌, కేర‌ళ.. ఈ నాలుగు ప్రాంతాల‌కి వెళ్లొచ్చాక బ‌న్నీ కొత్త సినిమా కోసం సెట్లోకి అడుగుపెట్ట‌బోతున్నాడు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

ఇప్ప‌టికే పూజా కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. ఇక చిత్రీక‌ర‌ణ‌ని షురూ చేయ‌బోతున్నారు. సుకుమార్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేశారు. శేషాచ‌లం అడ‌వుల నేప‌థ్యంలో సాగే చిత్ర‌మిది. దాంతో చిత్రానికి `శేషాచ‌లం` అనే పేరు పెట్టే ఆలోచ‌న‌లో చిత్ర‌బృందం ఉంద‌ట‌. రామ్‌చ‌ర‌ణ్‌తో రంగ‌స్థ‌లం తీసి హిట్టు కొట్టిన సుకుమార్.. ఇప్పుడు బ‌న్నీతో శేషాచ‌లం తీయ‌బోతున్నాడ‌న్న‌మాట‌. ఇందులో అల్లు అర్జున్ స‌ర‌స‌న ర‌ష్మిక మంద‌న్న న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.