`శుభ‌లేఖ‌+లు` ఘాటుమోటు!

పెద‌వి ముద్దుల తాంబూళం అందించ‌డం నేటి సినిమాల్లో ఓ ట్రెండ్. అర్జున్‌రెడ్డి, ఆర్‌.ఎక్స్ 100 చిత్రాల‌తో అది మ‌రింత చెల‌రేగుతోంది. ఇటీవ‌ల రిలీజైన ప‌లు ఐపు లేని సినిమాల్లో పెద‌వి ముద్దుల గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. ఇప్పుడు అదే బాట‌లో మ‌రో సినిమా రిలీజ్‌కి వ‌స్తోంది. అదే `శుభలేఖ+లు`. అస‌లు ఈ టైటిల్ మీనింగ్ ఏంటి? అనుకున్న‌వారికి ట్రైల‌ర్ ఇప్ప‌టికే షాకిచ్చింది. ఇందులో నాయ‌కానాయిక‌ల మ‌ధ్య పెద‌వి ముద్దులు, ఘాటైన రొమాన్స్ వేడెక్కిస్తోంది.

పోస్టర్, టీజర్, థియేట్రికల్ ట్రైలర్ టీనేజీ గాళ్స్ స్పీడ్‌.. స్మోకింగ్ స్కిల్స్ హీట్ పెంచాయి.. పుష్య‌మి ఫిల్మ్ మేక‌ర్స్ అధినేత బెల్లం రామ‌కృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని చూసి ఫ్యాన్సీ ఆఫ‌ర్స్‌ను వ‌ర‌ల్డ్ వైడ్ రైట్స్ ద‌క్కించుకుని గ్రాండ్‌గా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. హ‌నుమ తెలుగు మూవీస్ పతాకం పై రూపుదిద్దకున్న ఈ చిత్రం డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం రామానాయుడు స్టూడియోలో ప్రీరిలీజ్ ఈవెంట్‌లో అశోక్‌రెడ్డి, రాజ్‌కందుకూరికి స‌న్మానం చేశారు. హీరో శ్రీ‌నివాస్ సాయి మాట్లాడుతూ… ఈ సినిమాని చాలా బాగా తీశారు. ఆయ‌న చాలా కొత్త కొత్త థాట్స్‌తో మీ ముందుకు వ‌స్తారు. నిర్మాత‌లు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. మేమంద‌రం కొత్త వాళ్ళం అయిన మా మీద న‌మ్మ‌కంతో తీశారు. బెల్లంకొండ రామ‌కృష్ణ‌గారిని చూసిన త‌ర్వాత మాకు ఇంకా కాన్ఫిడెంట్ లెవ్స్ బాగా పెరిగాయి. కెరియ‌ర్‌లో ఎవ‌రికైనా అప్ అండ్ డైన్స్ ఉంటాయి. కాని ఎలాగోలా ఈ కెరియ‌ర్ కొన‌సాగాల‌ని కోరుకుంటున్నాను అన్నారు. ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ-“యూత్‌కి, పేరెంట్స్ మ‌ధ్య ఉండే గ్యాప్ గురించి తీసుకుని చేశాను. పిల్ల‌లు పెళ్లి అనే విష‌యానికి వ‌చ్చేస‌రికి ఎందుకు ఇండివిడ్యూలిటీ కోరుకుంటున్నారు అన్న పాయింట్ మీద ఉంటుంది“ అన్నారు.