నువ్వు తోపురా హీరో కారు యాక్సిడెంట్

శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌`లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్` చిత్రంతో వెండి తెర‌కు ప‌రిచ‌యం అయిన సుధాక‌ర్ కొమ్మాకుల కారు భారీ యాక్సిడెంట్ కు గురైంది. ఈ ప్ర‌మాదంలో ఒక మ‌హిళ మృతి చెందింది. సుధాక‌ర్ కు తీవ్ర గాయాల‌య్యాయి. మంగ‌ళ‌గిరి మండలం చిన‌కాకాని జాతీయ ర‌హ‌దారిపై కొద్దిసేప‌టి క్రిత‌మే ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప్ర‌స్తుతం సుధాక‌ర్ న‌టిస్తోన్న `నువ్వుతోపురా` సినిమా ప్ర‌మోష‌న్ లో భాగంగా హైద‌రాబాద్ నుంచి గుంటూరు వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది.

జాతీయ ర‌హ‌దారిపై మొక్క‌ల‌కు నీళ్లు పెడుతోన్న మ‌హిళ‌ను సుధాక‌ర్ కారు వేగంగా వెళ్లి ఢీ కొట్టి ప‌ల్టీలు కొట్టింది. దీంతో ఆ మ‌హిళ అక్క‌డిక్క‌డే మృతి చెందింది. తీవ్ర గాయ‌లైన‌ సుధాక‌ర్ ను హుటా హుటిన ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. సుధాక‌ర్ కు ఆరోగ్య వివ‌రాలు తెలియాల్సి ఉంది. ఇటీవ‌లే నువ్వు తోపురా సినిమా ట్రైల‌ర్ రిలీజ్ అయిన మంచి వ్యూస్ ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో సుధాక‌ర్ పెర్పామెన్స్ కు మంచి ప్ర‌శంస‌లు ద‌క్కాయి.