జూన్ లో అదితిరావ్ స‌మ్మోహ‌నం

Last Updated on by

ఇప్పుడు కొత్త సినిమాల విడుద‌ల తేదీ అంటే క‌ష్టం. ఏకంగా మే వ‌ర‌కు అన్ని సినిమాల రిలీజ్ డేట్స్ ఫిక్స్ అయిపోయాయి. ఇప్పుడు కొత్త‌గా వ‌చ్చి ఇరుక్కోవ‌డం కూడా క‌ష్ట‌మే. అలా చేస్తే అస‌లుకే మోసం వ‌స్తుంది. మార్చ్ నుంచి మే వ‌ర‌కు అంతా త‌మ త‌మ విడుద‌ల తేదీల‌ను ఫిక్స్ చేసుకుని నిశ్చింత‌గా ఉన్నారు. అందుకే ఇప్పుడు సుధీర్ బాబు త‌న కొత్త సినిమా విడుద‌ల తేదీని జూన్ లో పెట్టుకున్నాడు. ఇప్ప‌ట్లో అస‌లు క‌నిపించ‌డ‌మే మానేసాడు. ఈయ‌న ప్ర‌స్తుతం ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో స‌మ్మోహ‌నం సినిమా చేస్తున్నాడు. అచ్చ తెలుగు టైటిల్ తో వ‌స్తోన్న ఈ చిత్రంపై మంచి అంచ‌నాలు ఉన్నాయి. కార‌ణం ఇంద్ర‌గంటి ట్రాక్ రికార్డ్. పెద్ద హీరోలు లేకుండానే పెద్ద విజ‌యాలు అందుకుంటాడు ఈ ద‌ర్శ‌కుడు.

గ‌తేడాది ఇంద్ర‌గంటి తెర‌కెక్కించిన అమీతుమీ మంచి విజ‌యం సాధించింది. చిన్న సినిమాగా వ‌చ్చి పెద్ద హిట్ అయింది ఈ చిత్రం. ఇప్పుడు సుధీర్ బాబు సినిమాపై కూడా అంచ‌నాలు బాగానే ఉన్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ అదితిరావ్ హైద్రీ న‌టిస్తుంది. శివలెంక కృష్ణ‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. జెంటిల్ మ‌న్ త‌ర్వాత మ‌ళ్లీ ఈ కాంబినేష‌న్ లో సినిమా వ‌స్తుంది. స‌మ్మోహ‌నం చిత్ర షూటింగ్ పూర్తైంది. సినిమాను జూన్ 15న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. మొత్తానికి.. ఈ ఘ‌ట్ట‌మ‌నేని అల్లుడితో ఇంద్ర‌గంటి స‌మ్మోహ‌నం ఎలా ఉండ‌బోతుందో..?

User Comments