అల్లుడితో మొద‌లుపెట్టిన ఇంద్ర‌గంటి..

కొంద‌రు ద‌ర్శ‌కుల‌కు ఇండ‌స్ట్రీలో మంచి పేరు ఉంటుంది.. హిట్లు కూడా ఉంటాయి.. కానీ ఎందుకో తెలియ‌దు స్టార్ హీరోలు మాత్రం వాళ్ల‌తో ప‌ని చేయ‌డానికి పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌రు. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ కూడా ఇదే లిస్ట్ లోకి వ‌స్తాడు. ఈయ‌న చేసిన సినిమాల్లో చాలా వ‌ర‌కు విజ‌యాలే ఉన్నాయి. మొన్న‌టికి మొన్న ఈయ‌న చేసిన అమీతుమీ సూప‌ర్ హిట్ అయింది. దానికి ముందు నానితో చేసిన జెంటిల్ మ‌న్ కూడా హిట్టే. పైగా తెలుగు ఇండ‌స్ట్రీలో ఉన్న మోస్ట్ ఇంట‌లిజెంట్ ద‌ర్శ‌కుల్లో ఈయ‌న కూడా ఒక‌రు. కానీ స్టార్ హీరోలు మాత్రం ఇంద్ర‌గంటి వైపు చూడ‌రు

Sudheer Babu Aditi Rao Hydari Working Together Directed by Indraganti

ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం నాని మాత్ర‌మే ఈయ‌న‌తో సినిమా చేసిన పెద్ద స్టార్. అమీతుమీ త‌ర్వాత మ‌రోసారి చిన్న హీరోతోనే క‌మిటయ్యాడు ఇంద్ర గంటి. సుధీర్ బాబుతో ఈయ‌న కొత్త సినిమా మొద‌లు పెట్టాడు. శివలెంక కృష్ణ‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. జెంటిల్ మ‌న్ త‌ర్వాత మ‌ళ్లీ ఈ కాంబినేష‌న్ లో సినిమా వ‌స్తుంది. బాలీవుడ్ బ్యూటీ అదితిరావ్ హైదరి ఇందులో హీరోయిన్ గా న‌టిస్తుండ‌టం విశేషం. ఈ ఘ‌ట్ట‌మ‌నేని అల్లుడితో ఇంద్ర‌గంటి సినిమా ఎలా ఉండ‌బోతుందో..?