అల్ల‌రి పిల్ల‌తో హీరో ప్రేమ‌

ప్ర‌యోగాత్మక క‌థ‌ల్ని ఎంచుకుని సక్సెస్ అందుకుంటున్నాడు సుధీర్ బాబు. ఇటీవ‌లే స‌మ్మోహ‌నం చిత్రంతో స‌క్సెస్ అందుకున్నాడు. ఆ క్ర‌మంలోనే సొంతంగా సుధీర్ బాబు (ఎస్‌బి) ప్రొడక్షన్స్ సంస్థ‌ను స్థాపించి న‌న్ను దోచుకుందువ‌టే అంటూ సొంత బ్యాన‌ర్‌పై ఓ సినిమా తీస్తున్నాడు. ఈ చిత్రంతో ఆర్‌.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సుధీర్‌బాబు ఈ చిత్రంలో హీరో. న‌భా న‌టేష్ క‌థానాయిక‌. ఇటీవలే రిలీజ్ చేసిన ట్రైలర్ కు అద్భుతమైన స్ప ంద‌న‌ లభించింది. ఈరోజు ఆ ట్రైల‌ర్‌ని ట్వీట్ చేసిన మ‌హేష్ సుధీర్‌బాబుకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ట్రైల‌ర్ బావుంద‌ని ప్ర‌శంసించారు.

ప‌ని చేసే చోట ఆఫీస్‌లో అంద‌రినీ భ‌య‌పెట్టే సాఫ్ట్ వేర్ కంపెనీ మేనేజ‌ర్ గా సుధీర్‌బాబు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. అల్ల‌రి గ‌డుగ్గాయ్‌ సిరి పాత్ర‌లో న‌భా న‌టేశ్ న‌టించింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ఇది. సెప్టెంబర్ 21న ప్రంపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నామ‌ని ద‌ర్శ‌కుడు తెలిపారు. ట్రైల‌ర్‌తో ఆశించిన‌ క్రేజ్ వచ్చినందుకు టీం అంతా హ్యాపీగా ఉన్నామ‌ని తెలిపారు. నాయ‌కానాయిక‌ల పాత్ర‌ల‌కు అంద‌రూ క‌నెక్ట‌య్యారు. స‌మ్మెహ‌నం లాంటి మంచి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత‌ సుధీర్‌బాబు నుంచి వ‌స్తున్న చిత్రం కావ‌టంతో ప్రేక్ష‌కుల నుంచి అంచ‌నాలు భారీగా వున్నాయి. .. అని అన్నారు. ఇటీవ‌ల ప్రీప్రమోష‌న‌ల్ టూర్ త‌మ‌కు క‌లిసొచ్చింద‌ని తెలిపారు. క‌థ కొత్త‌గా ఉంటుంది. అజనీష్ సంగీతం ఆక‌ట్టుకుంటుంది .. అని అన్నారు.