సుహాసినిని బ‌లిప‌శువును చేశారా?

Last Updated on by

నంద‌మూరి ఫ్యామిలీని గ‌త కొన్నేళ్లుగా త‌న‌కు అనుకూలంగా వాడుకుంటున్న చంద్ర‌బాబు తెలంగాణ ఎన్నిక‌ల వేళ మ‌ళ్లీ అదే స్టాట‌జీతో నంద‌మూరి కుటుంబం నుంచి హ‌రికృష్ణ కుమార్తె సుహాసినిని కూక‌ట్‌ప‌ల్లి నుంచి రంగంలోకి దింపాడు. ఆ స్థానం నుంచి తెరాస అభ్య‌ర్థి మాధ‌వ‌రం కృష్ణారావు పోటీలో వున్నారు. అయినా అతివిశ్వాసానికి పోయిన చంద్ర‌బాబు నాయుడు త‌న బావ‌మ‌రిది హ‌రికృష్ణ సానుభూతి ఓటును క్యాష్ చేసుకోవాల‌ని ఒక్క ఓటుకు 5వేల చొప్పున పంచినా ఫ‌లితం లేకుండా పోయింది. సుహాసిని స్థానికురాలు కాక‌పోవ‌డం, చెన్నై నుంచి కేవ‌లం పోటీ కోస‌మే దిగుమ‌తి చేయ‌డం.. స్థానికి స‌మ‌స్య‌ల‌పై అవ‌గాహ‌న లేక‌పోవ‌డం వంటి కార‌ణాల‌తో పాటు ఆంధ్రా ఓట‌ర్లు కూడా తెరాస వైపే మొగ్గు చూప‌డంతో సుహాసిని ఓట‌మి అనివార్యంగా మారింది.

ఈ రోజు వెలువ‌డుతున్న ఫ‌లితాల్లో తొలి రౌండ్ నుంచి సుహాసిని తెరాస అభ్య‌ర్థి మాధ‌వ‌రం కృష్ణారావు క‌న్నా వెనుకంజ‌లో వుంటూ వ‌చ్చింది. తాజా రౌండ్‌కు వ‌చ్చే స‌రికి సుహాసిని రేస్‌లోనే లేక‌పోవ‌డం టీడీపీకి చెంప‌పెట్టుగా మారింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. ఈ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ప్ర‌చారానికి రావ‌డం, బాల‌కృష్ణ నిర్వ‌హించిన ప్ర‌చారం పెద్ద ప్ర‌హ‌స‌నంగా మార‌డంతో ప్ర‌చారం ముగేనాటికే మాధ‌వం గెలుపు ఖాయ‌మ‌నే సంకేతాలు వ‌చ్చేశాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు బ‌లంగా వినిపించారు. ఇప్పుడు అదే నిజం అవుతోంది. ఫ‌లితాన్ని గ‌మ‌నిస్తున్న రాజ‌కీయ విశ్లేష‌కుల‌తో పాటు మెజారిటీ ఆంధ్రా ఓట‌ర్లు చంద్ర‌బాబుపై దుమ్మెత్తిపోతున్నార‌ట‌. హ‌రికృష్ణ బ్ర‌తికున్న‌ప్పుడు నంద‌మూరి కుటుంబాన్న క‌న్నెత్తి కూడా చూడ‌టానికి ఇష్ట‌ప‌డ‌ని బాబు త‌న రాజ‌కీయ ల‌బ్దికోసం ఆ కుటుంబ ఆడ‌ప‌డుచును పోటీకి దింపి చివ‌రికి బ‌లిప‌శువును చేశాడ‌ని, ఇక నుంచైనా చంద్ర‌బాబు ఇలాంటి దిగ‌జారుడు రాజ‌కీయాలు వ‌దులుకుంటే మంచిద‌ని మండిప‌డుతున్నార‌ట‌.

User Comments