కాదంటూనే.. చరణ్ పై ప్రయోగం చేస్తున్నాడా..?

రామ్ చరణ్ కొత్త చిత్రం రంగస్థలం సినిమా షూటింగ్ గురించిన కొన్ని విశేషాలు ఇటీవల బయటకు వచ్చాయి.  చరణ్ ఇందులో పల్లెటూరి అబ్బాయిలా కనిపిస్తున్నాడు.  అతని లుక్ కొత్తగా ఉంది.

ఇక ఇది 1985 కాలం నాటి కథ కాబట్టి అప్పటి పరిస్థితులకు అనుగుణంగా సినిమా ఉంటుంది.

ఇక సుకుమార్ దర్శకుడు కావడంతో ఇందులో ఏదైనా ప్రయోగాలు చేస్తున్నాడేమో అని భయపడుతున్నారు ఫ్యాన్స్.

ఎందుకంటే.. సుకుమార్ సినిమాల్లో ప్రయోగాలు కొత్తగా ఉంటాయి.  తన ప్రతి సినిమాలోను స్క్రీన్ ప్లే కొత్తగా కనిపిస్తుంది.  పాపం అది అర్ధంగాక ప్రేక్షకులు కన్ఫ్యూషన్ కు గురవుతుంటారు.

సుకుమార్ స్క్రీన్ ప్లే వికటిస్తే 1 నేనొక్కడినే లా కమర్షియల్ గా ఫ్లాప్ అవడం ఖాయం.

ఇదే చరణ్ అభిమానులను భయపెడుతున్నది.  ఇక్కడ మరో విషయం కూడా ఉన్నది.

ఇందులో చరణ్ చెవిటివాడిలా కనిపిస్తాడని అంటున్నారు.  దీంతో ఫ్యాన్స్ కు టెన్షన్ పట్టుకుంది. ఇదేమి ఖర్మరా బాబు అనుకుంటున్నారు.  దీనిపై సుకుమార్ క్లారిటీ ఇచ్చాడు.

చరణ్ ను కొత్తగా చూస్తారని.. అంటే స్క్రీన్ ప్లే కన్ఫ్యూషన్ గా ఉండదని… స్ట్రెయిట్ గా ఉంటుందని చెప్పారు.  అచ్చమైన పల్లెటూరి వాతావరణం, స్వఛ్ఛమైన మనుషుల నేపథ్యంలో సాగే ఈ చిత్రం తనకి దర్శకుడిగా మంచి పేరు తెచ్చి పెట్టేది అవుతుందని అన్నాడు.

Follow US