సుక్కు సినిమా అఖిల్‌తోనా? మ‌రి మ‌హేష్‌?

Last Updated on by

చిత్ర‌సీమ‌లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఊహించ‌లేం. సినిమాకి కొబ్బ‌రికాయ కొట్టాక కూడా కాంబినేష‌న్లు మారిపోతుంటాయి. తాజాగా టాలీవుడ్‌లో అలాంటి ఓ అనూహ్య‌మైన మార్పు గురించే చ‌ర్చ జ‌రుగుతోంది. నిన్న మొన్న‌టివ‌ర‌కు మ‌హేష్ – సుకుమార్ కాంబినేష‌న్ ప‌క్కా అయిన‌ట్టే అని మాట్లాడుకొన్నారంతా. ప్ర‌స్తుతం సెట్స్‌పై ఉన్న `మ‌హ‌ర్షి` పూర్తి కాగానే, మ‌హేష్ – సుకుమార్ కాంబినేష‌న్‌లో సినిమానే ప‌ట్టాలెక్కుతుంద‌న్నారు. కానీ తాజాగా సుకుమార్ .. అఖిల్‌తో సినిమా చేయ‌డం కోసం రంగంలోకి దిగాడ‌ని ప్ర‌చారం సాగుతోంది.

`మ‌హ‌ర్షి` త‌ర్వాత మ‌హేష్ – అనిల్ రావిపూడి క‌ల‌యిక‌లో సినిమా ఉండొచ్చ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ జ‌నాలు మాట్లాడుకుంటున్నారు. `ఎఫ్‌2`తో ఘ‌న విజ‌యాన్ని అందుకున్న అనిల్ రావిపూడి ఇటీవ‌లే మ‌హేష్‌కి క‌థ వినిపించాడ‌ట‌. అది మ‌హేష్‌కి బాగా న‌చ్చ‌డంతో వెంట‌నే సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ‌దామ‌ని చెప్పాడ‌ట‌. దాంతో సుకుమార్ సినిమా ఆల‌స్య‌మ‌య్యే అవ‌కాశాలున్న‌ట్టు స‌మాచారం. సుకుమార్ కూడా త‌న ద‌గ్గ‌రున్న మ‌రో స్క్రిప్టుని బ‌య‌టికి తీసి అఖిల్‌తో తీయ‌డానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నార‌ని, అది మైత్రీ, అన్న‌పూర్ణ సంస్థ‌లు క‌లిసి నిర్మించ‌బోతున్నాయ‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ విష‌యం గురించి ఓ స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశాలున్నాయి.

User Comments