సుమంత్ మ‌రో కార్తికేయ‌..

Last Updated on by

అవును.. ఇప్పుడు సుమంత్ సినిమా ఫ‌స్ట్ లుక్ చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఈయ‌న ప్ర‌స్తుతం రెండు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. మ‌ళ్లీ రావా చిత్రం త‌ర్వాత సుమంత్ లో తెలియ‌ని కాన్ఫిడెన్స్ క‌నిపిస్తుంది. ఆ జోరులోనే వ‌ర‌స సినిమాలు చేస్తున్నాడు. ప్ర‌స్తుతం కొత్త ద‌ర్శ‌కుల‌తోనే ఎక్కువ‌గా ప‌ని చేస్తున్నాడు ఈ హీరో. అనిల్ శ్రీ‌కంఠంతో చేస్తోన్న ఇదం జ‌గ‌త్ జులైలో విడుద‌ల కానుంది. ఈ చిత్రంతో పాటే సుబ్ర‌మ‌ణ్య‌పురం అనే మ‌రో సినిమా కూడా చేస్తున్నాడు ఈ అక్కినేని అల్లుడు.

సంతోష్ జాగ‌ర్ల‌పూడి ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఇది సుమంత్ కు 25వ సినిమా కావ‌డం విశేషం. ఇవ‌న్నీ ఇలా ఉంటే ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ అచ్చంగా నిఖిల్ కార్తికేయ సినిమాను పోలి ఉంది. క‌థ‌లో కూడా పోలిక‌లు క‌నిపిస్తున్నాయి. ఆ పోస్ట‌ర్.. ఈ పోస్ట‌ర్ అచ్చంగా ఒకేలా అనిపిస్తున్నాయి. పైగా కార్తికేయ కూడా పూర్తిగా సుబ్ర‌మ‌ణ్య స్వామి చుట్టూ తిరిగే క‌థే. ఇప్పుడు సుమంత్ ఏం చేస్తున్నాడో తెలియ‌దు కానీ క‌చ్చితంగా కార్తికేయ పోలిక‌లు మాత్రం బాగానే క‌నిపిస్తున్నాయి. మ‌రి చూడాలిక‌.. ఈ పోలిక‌లు పోస్ట‌ర్ వ‌ర‌కే ఉన్నాయా లేదంటే లోప‌క కంటెంట్ వ‌ర‌కు కూడా ఉన్నాయా అనేది..?

User Comments