రజినీకాంత్ సినిమాలు మానేస్తే నెక్స్ట్ ఎవరు

Last Updated on by

త‌మిళ‌నాట నెక్ట్స్ నెంబ‌ర్ వ‌న్ ఎవ‌రు..? ఇప్పుడు ఈ ప్ర‌శ్న అభిమానుల్లో కూడా ఉంది. కానీ దీనికి స‌మాధాన‌మే దొర‌క‌డం లేదు. ఇప్ప‌టికైతే ర‌జినీకాంత్ ను కొట్టే హీరో అయితే రాలేదు. ఆయ‌న సినిమాల్లో ఉన్నంత వ‌ర‌కు ఆయ‌నే నెంబ‌ర్ వ‌న్. ఆ త‌ర్వాత స్థానం కోసం ఇప్పుడు అస‌లు పోటీ మొద‌లైంది. అజిత్ అని కొంద‌రు అంటున్నారు కానీ లెక్క‌లు మాత్రం విజ‌య్ అని చెబుతున్నాయి. కొన్ని సెంటిమెంట్లు కూడా ఇప్పుడు విజ‌య్ నెక్ట్స్ త‌మిళ నెంబ‌ర్ వ‌న్ అని నిరూపిస్తున్నాయి. కావాలంటే చూడండి.. ర‌జినీతో విజ‌య్ కు చాలా పోలిక‌లు క‌నిపిస్తున్నాయి. ముఖ్యంగా ర‌జినీకాంత్ తో సినిమాలు క‌మిటైన వెంట‌నే విజ‌య్ తోనూ ఆ నిర్మాత‌లే సినిమాలు చేస్తున్నారు.

లైకాలో విజ‌య్ తో క‌త్తి సినిమా చేసారు. అది ఇండ‌స్ట్రీ హిట్. ఆ త‌ర్వాత ఇప్పుడు లైకా సంస్థ ర‌జినీతో 2.0 చేస్తున్నారు. ఇక ఇప్పుడు స‌న్ పిక్చ‌ర్స్ ర‌జినీకాంత్ తో సినిమా అనౌన్స్ చేసింది. కార్తిక్ సుబ్బ రాజ్ దీనికి ద‌ర్శ‌కుడు. దీనికంటే ముందే స‌న్ పిక్చ‌ర్స్ ఏడేళ్ళ భారీ విరామం త‌ర్వాత విజ‌య్ తో సినిమా ప్ర‌క‌టించింది. అప్పుడెప్పుడో రోబో చేసిన త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడే విజ‌య్-మురుగ‌దాస్ సినిమాను ప్ర‌క‌టించింది ఈ నిర్మాణ సంస్థ‌. ఇప్పుడు ఇదే సంస్థ ర‌జినీ సినిమా అనౌన్స్ చేసింది. ఆ మ‌ధ్య వి క్రియేష‌న్స్ కూడా క‌బాలి సినిమా చేసిన త‌ర్వాత విజ‌య్ తో తేరి సినిమా చేసారు. ఇక తేండ్రాల్ మూవీస్ కూడా ర‌జినీ, విజ‌య్ తోనే వ‌ర‌స సినిమాలు చేస్తున్నారు. మొత్తానికి ఈ ఇద్ద‌రి విష‌యంలోనే ఇప్పుడు లెక్క‌ల‌న్నీ స‌రిపోతున్నాయి. దాన్నిబ‌ట్టి చూస్తే ర‌జినీ త‌ర్వాత విజ‌య్ నెం.1 అనుకోవ‌చ్చేమో మ‌రి..?

User Comments