సునీల్ కోసం గోపీచంద్ సినిమాలో!

Last Updated on by

సునీల్ పూర్తిగా త‌న ట్రాక్‌లోకి తిరిగొచ్చేసిన‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న కోసం ద‌ర్శ‌కులు కామెడీ పాత్ర‌ల్ని సిద్ధం చేయ‌డంలో బిజీ అయిపోయారు. సునీల్ ఓ క‌మెడియ‌న్‌గానే ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత క‌థానాయ‌కుడిగా మారాడు. ఆరంభంలో కొన్ని సినిమాలు ఆడాయి కానీ… ఈమ‌ధ్య వ‌రుస‌గా ప‌రాజ‌యాలే. సునీల్ సినిమాల‌కి మార్కెట్ దాదాపుగా ప‌డిపోయింది. ద‌ర్శ‌కనిర్మాత‌లెవ్వ‌రూ ఆయ‌న‌తో సినిమా చేయ‌డానికి ఆస‌క్తి చూప‌డం లేదు. దాంతో ఆయ‌న మ‌ళ్లీ త‌నకి అచ్చొచ్చిన కామెడీ పాత్ర‌ల‌పైనే దృష్టిపెట్టాడు.

అర‌వింద స‌మేత‌, ప‌డి ప‌డి లేచే మ‌న‌సు చిత్రాల్లో ఆయ‌న చేసిన కామెడీ హంగామా ఆక‌ట్టుకుంది. దాంతో దర్శ‌కులు కూడా ఆయ‌న కోసం కామెడీ పాత్ర‌ల్ని సృష్టించ‌డం మొద‌లుపెట్టారు. త్వ‌ర‌లోనే గోపీచంద్ క‌థానాయ‌కుడిగా సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. అందులో సునీల్ పూర్తిస్థాయి కామెడీ పాత్ర‌లో సంద‌డి చేయ‌నున్న‌ట్టు తెలిసింది. సంప‌త్ నంది ప్ర‌త్యేక‌మైన జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ సునీల్ కోసం కామెడీ పాత్ర‌ని రాస్తున్న‌ట్టు స‌మాచారం. `గౌత‌మ్‌నందా`తో తొలిసారి క‌లిసిన గోపీచంద్‌, సంప‌త్‌నంది ప‌రాజ‌యాన్ని ఎదుర్కున్నారు. ఈసారి మాత్రం విజ‌యం సాధించాల‌న్న క‌సితోనే రంగంలోకి దిగుతున్నారు.

User Comments