స‌న్నీ త‌స్మాత్ జాగ్ర‌త్త‌!

Last Updated on by

బాలీవుడ్ శృంగార తార స‌న్నీలియోన్ బ‌యోపిక్ బుల్లితెర వీక్ష‌కుల‌కు క‌నువిందు చేయ‌నున్న సంగ‌త తెలిసిందే. `క‌రణ్‌జీత్ కౌర్‌: ది అన్‌టోల్డ్ స్టోరి ఆఫ్ స‌న్నీలియోన్‌` అనేది టైటిల్. ఇదివ‌ర‌కూ రిలీజ్ చేసిన ట్రైల‌ర్‌కి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. స‌న్నీలియోన్ బాల్యం స‌హా లైఫ్‌లో ఎలాంటి స‌వాళ్ల‌ను ఎదుర్కొంది అన్న‌ది తెర‌పై చూపించ‌నున్నారు. ఆ క్ర‌మంలోనే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న వీరాభిమానులంతా వెయ్యి క‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నారు.

ఇక‌పోతే ఈ బుల్లితెర సిరీస్ ప్ర‌స్తుతం ఓ పెనువివాదంలో ఇరుక్కోవ‌డం చ‌ర్చ‌కొచ్చింది. స‌న్నీలియోన్ త‌మ ప‌రువు తీస్తోందంటూ శిక్కు సంఘాలు తీవ్రంగా విరుచుకుప‌డుతున్నాయి. దిల్లీకి చెందిన శిక్ గురుద్వారా మేనేజ్‌మెంట్ క‌మిటీ (డిఎస్‌జిఎంసీ) టైటిల్‌లో `కౌర్‌` అనే ప‌దాన్ని తొల‌గించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాయి. కౌర్ అనే ప‌దం వ‌ల్ల శిక్కుల మానాభిమానాలు మంట గ‌లిసిపోతున్నాయ‌న్న‌ది స‌ద‌రు మ‌త సంస్థ అభియోగం. గురువులు చెప్పింది ఏనాడూ స‌న్నీలియోన్ పాటించ‌లేదు. ఇప్పుడు బ‌యోపిక్ టైటిల్ అభ్యంత‌ర‌క‌రంగా ఉంది అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు శిక్కులు. ఈ టీవీ సిరీస్‌కి ఆదిత్య ద‌త్తా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. స‌న్నీలియోన్ స్వ‌యంగా టైటిల్ పాత్రలో న‌టిస్తోంది.

User Comments