మార్వ‌ల్ `సూప‌ర్ గాళ్` స‌న్నీ!

Last Updated on by

ప్ర‌ఖ్యాత మార్వ‌ల్ సంస్థ ఇండియ‌న్ స్టార్ల‌ను సెలెక్ట్ చేసుకుని ఇక్క‌డ భారీగా వ‌సూళ్ల‌ను కొల్ల‌గొట్టేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌ణాళిక‌ల్ని సిద్ధం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే ప‌లువురు భారీతీయ స్టార్ల‌కు ఈ సంస్థ నిర్మించిన సినిమాల్లో అవ‌కాశాలిచ్చి ప్రోత్స‌హించింది. అది గ‌తం అనుకుంటే వ‌ర్త‌మానంలో ఇండియ‌న్ సెన్సేష‌న్ .. శృంగార తార స‌న్నీలియోన్ కి అదిరిపోయే ఆఫ‌ర్ ఇచ్చేందుకు మార్వ‌ల్ సంస్థ స‌న్నాహ‌కాల్లో ఉందిట‌.

2018లో మార్వ‌ల్ సంస్థ నుంచి వ‌చ్చిన `అవెంజ‌ర్స్ : ఇన్‌ఫినిటీ వార్` చిత్రం సంచ‌ల‌న విజ‌యం సాధించి భార‌త‌దేశం నుంచి దాదాపు 300కోట్లు పైగా కొల్ల‌గొట్టింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా రికార్డ్ బ్రేకింగ్ వ‌సూళ్ల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద‌ సునామీ సృష్టించింది. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ సినిమా తెర‌కెక్కించేందుకు మార్వ‌ల్ సిద్ధ‌మ‌వుతోంది. `అవెంజ‌ర్స్ : ది ఎండ్ గేమ్` పేరుతో రూపొందిస్తున్న ఈ చిత్రంలో ఒక భార‌తీయ న‌టిని కామిక్ సూప‌ర్ హీరో రోల్ కి ఎంపిక చేయ‌నున్నామ‌ని ప్ర‌క‌టించింది. ఈ పాత్ర పేరును మార్వ‌ల్ వెల్ల‌డించింది. మార్వ‌ల్ రిలీజ్ చేసిన‌ కామిక్ బుక్ సిరీస్ లో ఫిక్ష‌న‌ల్ కామిక్ క్యారెక్ట‌ర్ మిస్ క‌మ‌లా ఖాన్ (ముస్లిమ్) సూప‌ర్ హీరో పాత్ర‌లో స‌న్నీ న‌టించే వీలుంద‌ని తెలుస్తోంది. ఆ ఆ మేర‌కు త‌న‌తో సంప్ర‌దింపులు జ‌రిగిన‌ట్టుగా ఓ హింట్ ని ఇచ్చింది స‌న్నీ. తాజాగా త‌న అధికారిక ఇన్‌స్టాగ్ర‌మ్ లో స‌న్నీలియోన్ పోస్ట్ చేసిన ఓ ఫోటో అందుకు హింట్ గా క‌నిపిస్తోంది. ఒక‌వేళ మార్వ‌ల్ నిర్ణ‌యం క‌రెక్టే అనుకుంటే స‌న్నీ లియోన్ రేంజ్ ఇంట‌ర్నేష‌న‌ల్ అవుతుంది. ఆ క్ర‌మంలోనే తాను న‌టించే సినిమాల మార్కెట్ అంత‌కంత‌కు పెరుగుతుంది. ప్ర‌స్తుతం స‌న్నీలియో న‌టిస్తున్న బ‌హుభాషా చిత్రం వీర‌మాదేవి చిత్రం ఆన్ సెట్స్ ఉన్న సంగ‌తి తెలిసిందే. స్టార్ స్ట‌క్ పేరుతో ఇప్ప‌టికే సౌంద‌ర్య ఉత్ప‌త్తుల వ్యాపారం చేస్తోంది స‌న్నీ. త‌న స్టార్ డ‌మ్ పెరిగే క్ర‌మంలో ఇత‌ర‌త్రా వ్యాపారాల‌కు అది క‌లిసొస్తుంద‌న‌డంలో సందేహం లేదు. సూప‌ర్ హీరో సిరీస్ లు వ‌రుస పెట్టి తెర‌కెక్కుతున్న క్ర‌మంలో స‌న్నీ ఆర్జ‌న అంత‌కంత‌కు రెట్టింప‌య్యే త‌రుణోపాయ‌మిది.

User Comments