వీడియో: స‌న్నీ స‌ర‌స‌స‌ల్లాపాలు

Last Updated on by

అందాల స‌న్నీలియోన్ ఆడిపాడితే శృంగార దేవ‌త నాట్య‌విలాపం క‌ళ్ల ముందు క‌నిపిస్తుంది. బేబి డాళ్ .. పింక్ లిప్స్ .. వీడియో ఆల్బ‌మ్స్‌తో స‌న్నీ ఆ లెవ‌ల్లో వేడెక్కించింది. స‌న్నీ ఆటా పాటా మంచు మ‌నోజ్ `క‌రెంట్ తీగ‌` చిత్రంలో తెలుగు ప్రేక్ష‌కులు వీక్షించారు. అటు నార్త్‌, ఇటు సౌత్ రెండు చోట్లా స‌న్నీ స‌ర‌స‌విర‌సాలు సుప‌రిచితం. ప్ర‌స్తుతం స్టార్‌లైన్ సౌంద‌ర్య ఉత్ప‌త్తుల కంపెనీని దేశ‌మంతా విస్త‌రిస్తూ హుషారుగా ప్ర‌చారం నిర్వ‌హిస్తోంది. ప‌నిలో ప‌నిగా వీలున్న‌పుడ‌ల్లా వీడియో ఆల్బ‌మ్స్‌తోనూ ప్రేక్ష‌కాభిమానుల ముందుకు వ‌స్తోంది.

తాజాగా స‌న్నీలియోన్ `అప్‌సైడ్ డౌన్‌` వీడియో ఆల్బ‌మ్ యూట్యూబ్‌లో ప్ర‌కంప‌నాలు రేపుతోంది. ఈ ఆల్బ‌మ్ పూర్తిగా కాన్సెప్ట్ బేస్డ్. ఆల్బ‌మ్‌లో స‌న్నీ మ్యాడ‌మ్ రాక కోసం వెయ్యి క‌ళ్ల‌తో ఎదురు చూసే తోట‌మాలి ఆత్రం క‌నిపిస్తుంది. స్విమ్మింగ్ పూల్ ముందు స‌న్నీ భంగిమ‌లు ప్ర‌త్యేకంగా హైలైట్ చేస్తూ ఆల్బ‌మ్‌లో వేడి పెంచుతాయి. ఆల్బ‌మ్ ఆద్యంతం వేడెక్కించే పాశ్చాత్య నృత్యాల‌తో అదిరిపోయిందంటే న‌మ్మండి. స‌న్నీ వ‌ర‌ల్డ్ వైడ్ ఫ్యాన్స్‌కి ఈ వీడియో ఆల్బ‌మ్ ఓ విజువ‌ల్ ట్రీట్ అనే చెప్పాలి. ఇదిగో ఈ లింక్‌పై క్లిక్ చేసి శృంగార దేవ‌త స‌న్నీలియోన్‌ విజువ‌ల్ గ్లింప్స్ మీరు కూడా అందుకోవ‌చ్చు.

User Comments