పిక్‌టాక్‌: స‌న్నీలో భ‌డ‌భాగ్ని

Last Updated on by

శృంగార‌తార స‌న్నీలియోన్ వాస్త‌విక జీవితంలో రియ‌ల్ ఛాలెంజ‌ర్‌గా ఎదిగిన వైనం ఎంద‌రికో స్ఫూర్తి. క‌జుర‌హో శిల్పంలా ఉండే స‌న్నీ అనూహ్యంగా పంజాబ్ నుంచి కెన‌డా వెళ్లాల్సొచ్చింది. అక్క‌డ ఉద్యోగం కోసం సాగించిన పోరాటంలో, చివ‌రికి విధివంచిత‌గా మారాల్సొచ్చింది. ఒక పోర్న్‌స్టార్‌గా అవ‌త‌రించి పొట్ట పోషించుకోవాల్సొచ్చింది. ఆ క్ర‌మంలోనే ఉన్న‌ట్టుండి ఓ రియ‌లైజేష‌న్‌. జీవితంలో సాధించాల్సింది ఇంకేదో ఉంది. అదేంటో వెతుక్కోవాల్సిందేన‌న్న పంతంతో ముంబై సినీప‌రిశ్ర‌మ వైపు అడుగులు వేసింది. అక్క‌డా స‌న్నీకి ఎన్నో అవ‌మానాలు.. ఆ క్ర‌మంలోనే తాను అనుకున్న‌ది సాధించుకుని 100 కోట్ల క్ల‌బ్ నాయిక‌గా ఎదిగింది.

స‌న్నీ…. ఈ ప‌య‌నం అంత ఆషామాషీ కానేకాదు. అడుగడుగునా పెనుస‌వాళ్లు, పురుషాధిక్య ప్ర‌పంచంలో విధివంచిత‌గా సాగించిన జ‌ర్నీ త‌న‌కు ఎన్నో నేర్పించింది. ఆ క్ర‌మంలోనే బాలీవుడ్‌లో స్టార్ స్టాట‌స్ అందుకుంది. సౌత్‌లోనూ స‌త్తా చాటింది. అటుపై స్టార్‌లైన్ సౌంద‌ర్య ఉత్ప‌త్తుల ప్ర‌పంచంలోకి అడుగుపెట్టింది. అక్క‌డ ఎంట‌ర్‌ప్రెన్యూర్‌గా నిరూపించుకునే పనిలో ఉంది. ప్ర‌స్తుతం స‌న్నీ జీవితం టీవీ సిరీస్ రూపంలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అలానే తెలుగు, త‌మిళ్‌, హిందీ త్రిభాషా చిత్రానికి ఇటీవ‌ల సంత‌కం చేసింది. ప‌నిలో ప‌నిగా బాలీవుడ్‌లోనూ ప‌లు క్రేజీ సినిమాల్లో నటించే స‌న్నాహ‌కంలో ఉంది. ఇన్ని చేస్తూనే ఇదిగో ఇలా ఫోటోషూట్ల‌తోనూ విరుచుకుప‌డుతోంది. తాజాగా ఇన్‌స్టాగ్ర‌మ్‌లో స‌న్నీ ఓ వండ‌ర్‌ఫుల్ ఫోటోని షేర్ చేసింది. ఈ ఫోజులో స‌న్నీలోని భ‌డ‌భాగ్ని దావాన‌లంలా ద‌హించేస్తోంది. కుర్ర‌కారు గుండెల్ని చీల్చి చెండాడుతోంది అంటే అతిశ‌యోక్తి కాదు.

User Comments