స‌న్నీ విసిరిన చెర్రీ బాంబ్‌

Last Updated on by

ఆన్‌లైన్‌, సామాజిక మాధ్య‌మాల్లో శృంగార తార స‌న్నీలియోన్‌కి ఉన్న ఫాలోయింగ్ చూస్తే షాక్ తినాల్సిందే. ఇప్ప‌టికే ఇన్‌స్టాగ్ర‌మ్‌లో ఏకంగా కోటి 40ల‌క్షల మంది(14 మిలియ‌న్లు) త‌న‌ని అనుస‌రిస్తున్నారు. ఈ విష‌యాన్ని స‌న్నీలియోన్ స్వ‌యంగా రివీల్ చేసింది. ఇక‌పోతే ఇంత‌మందికి త‌న స్టార్‌స్ట‌క్ సౌంద‌ర్య ఉత్ప‌త్తుల గురించి విష‌య‌ప‌రిజ్ఞానం ఉంద‌ని అర్థం చేసుకోవ‌చ్చు. అంటే స‌న్నీ కంపెనీ ఏ రేంజులో స‌క్సెస‌వుతోందో దీనిని బ‌ట్టి ఊహించ‌వ‌చ్చు. కేవ‌లం కొన్ని నెల‌ల్లోనే స్టార్ స్ట‌క్ కంపెనీని స‌న్నీ పెద్ద రేంజులో విస్త‌రించడానికి కార‌ణం త‌న‌కు ఉన్న అసాధార‌ణ ఫాలోయింగేన‌ని అర్థం చేసుకోవ‌చ్చు.

అయితే ఈ స్థాయిలో యూత్ ఫాలో అవ్వ‌డానికి స‌హేతుక కార‌ణాలు ఉన్నాయి. స‌న్నీ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఇన్‌స్టాగ్ర‌మ్‌లో ఫ్రెష్ ఫోటోషూట్లు, వీడియోలు అప్‌లోడ్ చేస్తూ యంగేజ్ చేస్తోంది. ఇందులో ఎప్ప‌టిక‌ప్పుడు నిత్య‌నూత‌న‌మైన కంటికింపైన స్ట‌ఫ్‌ని అందిస్తోంది. త‌న‌దైన‌ అందంతో గాలం వేయ‌డం, అటుపై త‌న స్టార్‌స్ట‌క్ ఉత్ప‌త్తుల‌కు ప్ర‌చారం చేసుకోవ‌డం.. ఇదో ర‌కం స్ట్రాట‌జీ. ఇది పెద్ద రేంజులోనే వ‌ర్క‌వుట‌వుతోందని అర్థం చేసుకోవాలి. ఇక స‌న్నీ న‌టించిన `క‌ర‌ణ్‌జీత్ కౌర్ – ది అన్‌టోల్డ్ స్టోరి ఆఫ్ స‌న్నీలియోన్‌` బుల్లితెర‌పై పెద్ద స‌క్సెసైంది. హాలీవుడ్ శాక్ర్‌డ్ గేమ్స్ త‌ర్వాత ఆ స్థాయిలో పాపులారిటీ తెచ్చుకుంటున్న సిరీస్ ఇది. స‌న్నీ జీవితం గురించి తెలుసుకోవాల‌న్న ఆస‌క్తి యువ‌త‌రంలో ఉంది కాబ‌ట్టి ఈ సిరీస్ అంతే పెద్ద స‌క్సెసైంది.

User Comments