మ‌హేష్‌కి ఈసారి కూడా రూ: 50 కోట్లు

మ‌హేష్ త‌న స్టార్ ఇమేజ్‌ని తెలివిగా మార్కెట్ చేసుకుంటున్నాడు. త‌న‌కున్న క్రౌడ్ పుల్లింగ్ స్టామినాకి త‌గ్గ‌ట్టుగా అధిక మొత్తంలో పారితోషికాన్ని సొంతం చేసుకుంటున్నారు. నిర్మాత‌గా తానూ సినిమాలో ఓ భాగ‌మైపోతూ… క‌ష్ట‌న‌ష్టాల్ని మోసే బాధ్య‌త‌ని తీసుకుంటూనే ఆదాయం సృష్టించుకుంటున్నారు. త్వ‌ర‌లోనే ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోయే చిత్రం కోసం మ‌హేష్‌కి రూ: 50 కోట్ల ప్యాకేజ్ ద‌క్క‌బోతోంద‌ట‌. `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రానికి కూడా ఆయ‌న‌కి అంతే గిట్టుబాటు అయ్యింది. ఆ త‌ర‌హా స్ట్రాట‌జీతోనే త‌దుప‌రి సినిమాకోసం ముందుకు వెళుతున్నారు. అందుకే అంత పెద్ద మొత్తంలో రెమ్యున‌రేష‌న్ ఖాయ‌మైన‌ట్టు స‌మాచారం. `స‌రిలేరు నీకెవ్వ‌రు` సినిమా త‌ర‌హాలోనే కొత్త చిత్రాన్ని త‌క్కువ రోజుల్లో, త‌క్కువ బ‌డ్జెట్‌లో పూర్తి చేయ‌బోతున్నార‌ట‌. మైత్రీ మూవీ మేక‌ర్స్‌తోపాటు, 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ సంస్థ‌లు చిత్ర నిర్మాణంలో భాగం కాబోతున్నాయి. నిజానికి మ‌హేష్ మైత్రీతో ఓ సినిమా చేయాల్సి ఉంది. ప‌ర‌శురామ్ ఏమో 14 రీల్స్ ప్ల‌స్‌లో సినిమా చేయాలి. అందరికీ అనుకూలంగా ఉంటుందని… ఆ రెండు సంస్థ‌ల్ని నిర్మాణంలో భాగం చేశార‌ట మ‌హేష్‌. అలా ఈ కాంబినేషన్ సెట్ట‌య్యిందన్న‌మాట‌.