3 కాల్షీట్లు ప‌ని చేసిన ఏకైక హీరో

Last Updated on by

ద‌శాబ్ధాలు గ‌డిచినా అల్లూరి సీతారామ‌రాజు ప్ర‌తిరూపం ఎవ‌రు? అంటే స‌గ‌టు ప్రేక్ష‌కుడు ఠ‌కీమ‌ని సూప‌ర్‌స్టార్ కృష్ణ పేరు చెబుతాడు. అంత‌గా ఆయ‌న పాపుల‌ర్‌. మ‌న్యంవీరుడికి మ‌రు రూపంగా ఆయ‌న ఖ్యాతి ఘ‌డించారు. బ్రిటీష్ వాళ్ల‌పై తిరుగుబాటు చేసి.. అల్లూరిగా కృష్ణ విల్లు ఎక్కుపెట్టి.. శ‌రం సంధించే తీరు వీరుడిని త‌ల‌పించింది. అందుకే దశాబ్ధాలు గడుస్తున్నా ఇంకా ఇంకా పాత్ర‌నే త‌ల‌చుకుంటున్నారు తెలుగు జ‌నం.

సూప‌ర్‌స్టార్ నాటి రోజుల్లో ఎంతో క్ర‌మ‌శిక్ష‌ణ‌, నిబ‌ద్ధ‌త క‌లిగిన‌వాడిగా విరాజిల్లారు. ఒకే రోజులో మూడు కాల్షీట్లు ప‌ని చేసిన ఏకైక స్టార్‌గా ఆయ‌న పేరు చెబుతుంటారు. కృష్ణ హార్డ్ వ‌ర్కింగ్ నేచుర్ ఆ త‌ర‌వాత ఆయ‌న న‌ట‌వార‌సుడు సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌కి అబ్బింది. అయితే నేటి ట్రెండ్‌కి త‌గ్గ‌ట్టు భారీ చిత్రాల్ని ఒక‌దాని త‌ర‌వాత ఒక‌టిగా మాత్ర‌మే మ‌హేష్ చేస్తున్నాడు. న‌వ‌త‌రం హీరోలంతా ఇదే తీరుగా ఉన్నారు. ఇక‌పోతే మ‌హేష్ ఇటీవ‌లి కాలంలో సినిమాల పరంగా స్పీడ్ పెంచే ఆలోచ‌న‌లో ఉన్నారు. ఒక సినిమా సెట్స్‌లో ఉండ‌గానే ఇంకో సినిమా ప్రారంభించేందుకు సిద్ధ‌మేన‌ని ప్ర‌క‌టించారు. ఇక‌పోతే నేడు సూప‌ర్‌స్టార్ కృష్ణ‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు చెబుతూ కృష్ణ‌- మ‌హేష్ సేన సంబ‌రాల్లో మునిగి తేలారు. సూప‌ర్‌స్టార్ ఇంటిల్లిపాదీ కృష్ణ‌కు బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు తెలిపారు. హైద‌రాబాద్ నాన‌క్‌రామ్‌గూడ‌లోని తోట లాంటి కృష్ణ ఇంటి ప‌రిస‌రాల్లో సంబ‌రం వాతావ‌ర‌ణం నెల‌కొందిప్పుడు.

User Comments