ఫ్యాన్స్ కి సూప‌ర్ స్టార్ బ‌ర్త్ డే గిఫ్ట్?

Last Updated on by

MB26 గురించిన రెండు ఆస‌క్తిక‌ర విష‌యాలు ఫిలింవ‌ర్గాల్ని వేడెక్కిస్తున్నాయి. ఈ సినిమా ప్రారంభోత్స‌వం ఎప్పుడు? అలాగే ఈ చిత్రానికి దిల్ రాజు స‌మ‌ర్ప‌కుడుగా కొన‌సాగుతున్నారా లేదా? ఈ రెండు కోణాల్లో అత్యంత క్లోజ్ సోర్సెస్ ని ప్ర‌శ్నిస్తే తెలిసిన ఆస‌క్తిక‌ర సంగ‌తులివి…

సూప‌ర్ స్టార్ మ‌హేష్ ప్ర‌స్తుతం `మ‌హ‌ర్షి` స‌క్సెస్ ని మ‌నస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారు. త‌న కెరీర్ ల్యాండ్ మార్క్ 25వ‌ సినిమా మ‌హ‌ర్షి పై తాను ఉంచిన న‌మ్మ‌కం నిజ‌మైందన్న ఆనందంలో ప్ర‌స్తుతం యూర‌ఫ్ కు ఫ్యామిలీ ట్రిప్ వెళ్లారు. మ‌హేష్ తో పాటు న‌మ్ర‌త‌- గౌత‌మ్- సితార బృందం జాలీ ట్రిప్ లో పాల్గొంటున్నారు. 10-15 రోజుల సుదీర్ఘ‌మైన ట్రిప్ ఇద‌ని తెలుస్తోంది. ఈ ట్రిప్ ముగించుకుని మ‌హేష్ తిరిగి హైద‌రాబాద్ రాగానే సినిమా ప్రారంభోత్స‌వం ఉంటుంది. అయితే అందుకు ముహూర్తం ఎప్పుడు? అన్న‌ది ఇంకా ఫిక్స్ చేయ‌లేదు. సాధ్య‌మైనంత వ‌ర‌కూ ఈ సినిమా లాంచ్ స్పెష‌ల్ గా ఉండాల‌ని మ‌హేష్ భావిస్తున్నార‌ట‌. ఈ నెల 31న సూప‌ర్ స్టార్ కృష్ణ బ‌ర్త్ డే సంద‌ర్భంగా మ‌హేష్ సినిమాని ఆరోజు లాంచ్ చేసే వీలుంద‌ని చెబుతున్నారు. ప్ర‌తియేటా సూప‌ర్ స్టార్ కృష్ణ‌- మ‌హేష్ అభిమానుల స‌మ‌క్షంలో ఘ‌నంగా బ‌ర్త్ డే వేడుక‌లు నిర్వ‌హిస్తుంటారు. ఈసారి ఫ్యాన్స్ కి స‌ర్ ప్రైజ్ ఇచ్చేలా మ‌హేష్ 26వ సినిమా లాంచింగ్ చేయ‌బోతున్నార‌న్న ముచ్చ‌ట ఇన్ సైడ్ స‌ర్కిల్స్ లో వినిపిస్తోంది.

ఇక‌పోతే ఈ చిత్రాన్ని ఏకే ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప‌తాకంపై అనీల్ సుంక‌ర నిర్మిస్తున్నారు. దిల్ రాజు స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని ప్ర‌చార‌మైంది. అయితే మ‌హేష్ 25 పార్ట‌న‌ర్స్ గొడ‌వ‌ల వ‌ల్ల 26వ సినిమా నుంచి దిల్ రాజు విర‌మించుకున్నార‌ని అప్ప‌ట్లో ఓ ప్ర‌చారం వేడెక్కించిన సంగ‌తి తెలిసిందే. తాజా స‌మాచారం ప్ర‌కారం.. అది నిజం కాద‌ని ఎంబీ 26 క్లోజ్ సోర్స్ డిక్లేర్ చేసింది. అనీల్ సుంక‌ర – దిల్ రాజు సంయుక్త నిర్మాణంలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. జూన్ 26 నుంచి రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ ప్రారంభించి 2020 సంక్రాంతికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఇక‌పోతే ఎంబీ 27, ఎంబీ 28 కి దిల్ రాజుకు ఛాన్సు లేదు.. కాబ‌ట్టి ఎంబీ 26 ని ఎట్టి ప‌రిస్థితిలో దిల్ రాజు వ‌దులుకునేందుకు సిద్ధంగా లేర‌ని తెలుస్తోంది. ఈ సినిమాలో ర‌ష్మిక మంద‌న ఓ క‌థానాయిక‌. దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు.

User Comments