సూప‌ర్‌స్టార్‌ సామాన్యుడు?

Last Updated on by

త‌న ప్ర‌తి సినిమాలో లాజిక్కు, జిమ్మిక్కుతో ఆక‌ట్టుకునే సుకుమార్ ఈసారి ఏం చేయ‌బోతున్నాడు? ప‌్ర‌స్తుతం మ‌హేష్ అభిమానుల క‌ర్ణ‌భేరిపై వెయ్యి ఏనుగుల‌ ఘీంకార శ‌బ్ధం చేసే ప్ర‌శ్న ఇది. మొత్తానికి ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం రానే వ‌చ్చింది. 1నేనొక్క‌డినేలో మ‌హేష్‌ని త‌న‌కుతాను ఊహించేసుకుని హ్యాలోజినేష‌న్‌తో భ‌య‌ప‌డే యువ‌కుడిగా చూపించాడు. త‌న‌ని ఎవ‌రో వెంబ‌డిస్తున్నార‌ని, చంపేందుకు వ‌స్తున్నార‌ని భావించి నానా ర‌చ్చ చేసే పాత్ర అది. హాలీవుడ్‌లో జెట్‌లీ `ది వ‌న్‌`, బార్న్‌ సినిమాల‌ స్ఫూర్తితో 1నేనొక్క‌డినే చిత్రాన్ని మ‌లిచాడు సుక్కూ. ఆ సంగ‌తిని అత‌డే అంగీక‌రించాడు. అయితే ఒకే ఒక్క‌ చిన్న‌పాటి పొర‌పాటు 1నేనొక్క‌డినే ఫ‌లితాన్ని అనూహ్యంగా మార్చేసింది. ఏం చెప్పినా సామాన్యుడికి అర్థ‌మ‌య్యేలా చెప్పాలి! అన్న సంగ‌తి ఆ ఫ‌లితం సుకుమార్‌కి పాఠమైంది. ఆ త‌ర‌వాత `నాన్న‌కు ప్రేమ‌తో`, `రంగ‌స్థ‌లం` చిత్రాల్ని ఎంతో జాగ్ర‌త్త‌గా తెర‌కెక్కించాడు. ఈ రెండు సినిమాల్లో జ‌నాల‌కు అర్థ‌మ‌య్యే లాజిక్కు, జిమ్మిక్కు వాడాడు. నాన్న‌కు ప్రేమ‌తో చిత్రంలో స్పంద‌న‌- ప్ర‌తిస్పంద‌న ఫార్ములాని అప్ల‌య్ చేస్తే, రంగ‌స్థ‌లంలో బ్ర‌హ్మ చెవుడు అనే పాయింట్‌ని వాడుకున్నాడు. మొత్తానికి రెండు సినిమాలు బ్లాక్‌బ‌స్ట‌ర్లు. సుక్కూ లాజిక్ అంద‌రికీ అర్థ‌మ‌వ్వ‌డంతో ఆ రెండు సినిమాల‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. అందుకే ఇప్పుడు అదే జాగ్ర‌త్త‌ను మ‌హేష్ కోసం తీసుకుంటున్నాడు సుక్కూ.

ఈసారి మ‌హేష్‌ని ఒక సామాన్యుడిగా చూపిస్తున్నాడుట‌. క‌థ‌లో సుక్కూ త‌ర‌హా లాజిక్కు, జిమ్మిక్కులు ఉంటూనే ఆద్యంతం సినిమా మైమ‌రిపిస్తుందిట‌. ఇప్ప‌టికే ఏడాదిగా జ‌క్క‌న్న‌లా స్క్రిప్టుని చెక్కుతున్నాడు.. ఉలి వేసి శిల్పిలా మారాడు. అయితే తాజాగా స్క్రిప్టు సిద్ధ‌మైంద‌న్న రిపోర్ట్ అందింది. మ‌హేష్ 25 ప్ర‌స్తుతం ఆన్‌సెట్స్ ఉంది. మ‌హేష్ 26 ద‌స‌రాకి లాంచ్ చేస్తారు. జ‌న‌వ‌రి 2019కి రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ మొద‌లు పెట్టి అదే ఏడాది రిలీజ్‌కి సిద్ధం చేస్తాడుట సుక్కూ. మ‌హేష్‌ని నార్మ‌ల్ గ‌య్‌లా.. సామాన్యుడిలా.. సాధాసీదా కుర్రాడిలా చూపిస్తున్నాడంటే దానివెన‌క ఇంకేదో పెద్ద స్కెచ్చే ఉంటుందండోయ్‌!

User Comments