కొత్త ఏడాది ర‌జినీ కొత్త కబురు

Last Updated on by

కొత్త ఏడాది ఆల్రెడీ అయిపోయింది క‌దా.. మ‌ళ్లీ ఇప్పుడేంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు అయింది మ‌న కొత్త ఏడాది. కానీ మ‌నం మాట్లాడేది త‌మిళ కొత్త ఏడాది. ఏప్రిల్ 14న అక్క‌డ కొత్త ఏడాది. వాళ్ల ఉగాది. త‌మిళులు సంతోషంగా జ‌రుపుకునే పండ‌గ ఇది. ఈ పండ‌గ‌నే మ‌రింత స్పెష‌ల్ గా మార్చే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు సూప‌ర్ స్టార్. ఇప్ప‌టికే ఈయ‌న న‌టించిన కాలా ఏప్రిల్ 27న రానుంది. అది ఇప్పుడు అభిమానుల‌కు పెద్ద‌గా కిక్ ఇవ్వ‌డం లేదు. కానీ ఆయ‌న ఇచ్చే స్టేట్మెంట్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇవ్వ‌నుంది. అది కూడా పొలిటిక‌ల్ ఎంట్రీ గురించి. ఇప్ప‌టికే తాను రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నాన‌ని క‌న్ఫ‌ర్మ్ చేసిన సూప‌ర్ స్టార్.. ఇప్పుడు పార్టీని.. విధివిధానాల‌ను చెప్ప‌బోతున్నాడు. దానికి ఏప్రిల్ 14న స‌రైన తేదీగా ఎంచుకున్నాడు ర‌జినీకాంత్. ఇప్ప‌టికే దీనికి సంబంధించిన ఏర్పాట్ల‌న్నీ జ‌రుగుతున్నాయి.

త‌మిళ కొత్త ఏడాది సంద‌ర్భంగా త‌న పార్టీ పేరుతో పాటు అన్ని విశేషాల‌ను అదే రోజు చెప్ప‌బోతున్నాడు ర‌జినీకాంత్. దాంతో అభిమానుల్లో ఆనందానికి అవ‌ధులే లేవు. ర‌జినీ రాజ‌కీయాల్లోకి వ‌స్తే చూద్దాం అని వేచి చూస్తోన్న వాళ్ల‌కు ఏప్రిల్ 14న ఆ కోరిక తీర‌బోతుంది. అన్న‌ట్లు ఆయ‌న వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దిగ‌బోతున్నారు. క‌మ‌ల్ కూడా ఈ పోటీలో ఉండ‌టం ఇక్క‌డ విశేషం. మొత్తానికి ర‌జినీ రాజ‌కీయ చ‌ద‌రంగం ఎలా ఉండ‌బోతుందో..?

User Comments