శ్రీ‌దేవి మ‌ర‌ణంపై సుప్రీం సీరియ‌స్

Last Updated on by

అదేంటి.. శ్రీ‌దేవి చ‌నిపోయి కూడా రెండు నెల‌లు దాటేసింది. ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఎందుకు ఈ మ‌ర‌ణంపై క‌ల‌గ‌చేసుకుంది.. అయినా శ్రీ‌దేవి మ‌ర‌ణంపై దుబాయ్ పోలీసులు కూడా క్లీన్ చీట్ ఇచ్చారు క‌దా.. ఇప్పుడు ఎందుకు మ‌ళ్లీ కోర్ట్ వ‌చ్చింది అనే అనుమానాలు అంద‌ర్లోనూ ఉంటాయి. అయితే శ్రీ‌దేవి చ‌నిపోయిన త‌ర్వాత పోలీసులు అన్నీ పూర్తి చేసిన త‌ర్వాత కానీ నాలుగు రోజుల‌కు బాడీ అప్ప‌గించారు. ఫిబ్ర‌వ‌రి 24న శ్రీ‌దేవి చ‌నిపోతే.. 28న ఇండియాకు వ‌చ్చింది ఆమె మృత‌దేహం. ఇదంతా ఇలా ఉంటే శ్రీ‌దేవి మ‌ర‌ణంపై అనుమానాలు ఉన్నాయంటూ ఫిల్మ్ మేక‌ర్ సునీల్ సింగ్ ఢిల్లీ కోర్టులో కేస్ వేసాడు. శ్రీ‌దేవి పేరు మీద ఒమ‌న్ లో 240 కోట్ల ఇన్స్యూరెన్స్ పాల‌సీ ఉంద‌ని.. ఆమె దుబాయ్ లో చ‌నిపోతేనే ఆ ఇన్స్యూరెన్స్ వ‌స్తుంద‌ని.. అచ్చంగా అలాగే శ్రీ‌దేవి కూడా అక్క‌డే చ‌నిపోయింద‌ని.. అందుకే ఆమె మ‌ర‌ణంపై త‌న‌కు అనుమానాలున్నాయంటూ కోర్ట్ లో పిటిష‌న్ దాఖ‌లు చేసాడు. ముందు ఈ ఇష్యూను స్వీక‌రించిన కోర్ట్.. ఇప్పుడు ఎలాంటి అనుమానాలు అవ‌స‌రం లేదంటూ తేల్చేసింది. సునీల్ సింగ్ వేసిన కేస్ ను కొట్టిపారేస్తూ తీర్పు ఇచ్చింది సుప్రీమ్ కోర్ట్. దాంతో అభిమానుల్లో ఉన్న అనుమానాలు కూడా తెగిపోయాయి.

User Comments