లేడీ గూఢ‌చారి కిక్కో కిక్కు

Last Updated on by

లేడీ గూఢ‌చారి కిక్కుమీద కిక్కు ర‌ప్పిస్తోంది. అస‌లింత‌కీ ఎవ‌రీ స్ట‌న్నింగ్ రెబ‌ల్‌ గూఢ‌చారి? ఊహించండి చూద్దాం.. ఒక‌వేళ ఈ గూఢ‌చారి ఎవ‌రో క‌నిపెట్టాంటే ముందుగా ఓసారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లాలి.

స‌రిగ్గా అది ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న రోజులు. ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ సైతం కెరీర్ స్ట్ర‌గుల్ లోంచి బ‌య‌ట‌ప‌డే స‌న్నివేశం. ఈవీవీ కెరీర్ ఆరంభించిన ఆరేళ్ల‌కు ప‌వ‌న్ ఎంట్రీ పెద్ద హాట్ టాపిక్‌గా ఉంది అప్ప‌టికే. అలా ఆ ఇద్ద‌రి కాంబోలో `అక్క‌డ అమ్మాయి – ఇక్క‌డ అబ్బాయి` తెర‌కెక్కింది. ఈ చిత్రంతోనే అక్కినేని నాగేశ్వ‌ర‌రావు గారాల‌ మ‌న‌వ‌రాలు సుప్రియ క‌థానాయిక‌గా ఎంట్రీ ఇచ్చారు. తొలి ప్ర‌య‌త్నం ఆశించిన రిజ‌ల్ట్‌ను ఇవ్వ‌లేదు. ఆ త‌ర్వాత‌ సుప్రియ ఒకే ఒక్క సినిమాతో ఇక తెర‌వెన‌క్కి వెళ్లిపోయారు. ఆ త‌ర్వాత అస‌లు ముఖానికి రంగేసుకునేందుకు ఇష్ట‌ప‌డ‌లేదు. అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వ‌చ్చి సుప్రియ అలా ఎందుకు చేశారో అంటూ అభిమానులు మాట్లాడుకున్నారు. ఆ క్ర‌మంలోనే బోలెడన్ని ప‌రిణామాలు. సుప్రియ ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మేటి నిర్మాత‌గా కొన‌సాగుతున్నారు. అన్న‌పూర్ణ స్టూడియోస్ బాధ్య‌త‌ల్ని త‌నే తెర‌వెన‌క – తెర ముందు ఉండి మ‌రీ న‌డిపిస్తున్నారు. ఇక‌పోతే త‌ను అస్స‌లు న‌ట‌న‌కు ఎందుక‌నో విముఖంగా ఉన్నారు. ఇన్నాళ్టికి సుప్రియ పోస్ట‌ర్ వేసి కీరోల్ అంటూ ప్ర‌క‌టించ‌డం చూస్తుంటే స‌డెన్ షాక్‌గానే చెప్పుకుంటున్నారంతా. ఈసారి లేడీ గుఢ‌చారిగా క‌సి తీర్చుకుంటున్నారు మ్యాడ‌మ్‌.. లేడీ నిర్మాత కం లేడీ డాన్‌! అంటూ మాట్లాడుకుంటున్నారు. అడివి శేష్ `గూఢ‌చారి` చిత్రంలో లేడీ గూఢ‌చారిగా సుప్రియ న‌టిస్తున్నార‌ట‌. న‌దియా ఖురేషి అనేది ఈ పాత్ర పేరు. అభిషేక్ పిక్చ‌ర్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో శోభిత ధూళిపాల క‌థానాయిక‌. ప్ర‌కాష్‌రాజ్‌, వెన్నెల కిషోర్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

User Comments