సైరా దర్శకుడికి అలా జరిగిందా?

చిరంజీవితో సినిమా చేసే అవకాశం వచ్చేసరికి ఎగిరి గంతేశాడు సురేందర్‌రెడ్డి. లేక లేక వచ్చిన ఆ అవకాశాన్ని ఎలాగైనా సద్వినియోగం చేసుకొని రెండు మూడేళ్లు కష్టపడ్డాడు. అనుకున్నట్టుగానే `సైరా నరసింహారెడ్డి`ని పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. సురేందర్‌రెడ్డి తీసిన విధానం బాగుందన్నారు, చిరు బాగా నటించాడన్నారు, అన్నీ బాగున్నాయన్నారు కానీ సినిమా మాత్రం నిలబడలేకపోయింది. ఆ చిత్రాన్ని నిర్మించిన రామ్‌చరణ్‌కి నష్టాలొచ్చాయని పరిశ్రమ వర్గాలు మాట్లాడుకున్నాయి.

అయితే ఆ ప్రభావం సురేందర్‌రెడ్డిపై బలంగా పడిందట. ఆ సినిమా ఫెయిల్యూర్ ప్రభావం ఒకెత్తైతే, చేసిన పనికి పారితోషికం అందకపోవడం మరో ఎత్తు. ఈ సినిమాకోసం సురేందర్‌రెడ్డి రూ: 8 కోట్లు పారితోషికం అడిగాడట. అయితే ఆయనకి ఇప్పటిదాకా 2 కోట్లు మాత్రమే వచ్చాయట. మిగిలిన మొత్తం ఇవ్వాలని చాలా రోజులుగా మెగా కాంపౌండ్ తలుపు తడుతూనే ఉన్నాడట. కానీ ఆయన మొర ఆలకించేవాళ్లే కనిపించడం లేదట. దీనిపై సురేందర్‌రెడ్డి న్యాయపోరాటానికి దిగుతున్నట్టు సమాచారం. మరి ఈ వ్యవహారం ఎంతవరకు వెళుతుందో చూడాలి. అన్నట్టు సురేందర్‌రెడ్డి `సైరా` తర్వాత మళ్లీ కొత్త సినిమాని ప్రకటించనేలేదు.