బాబు చేతిలో బ్రోచేవారెవ‌రురా 

శ్రీ‌విష్ణు- నివేద థామ‌స్ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `బ్రోచేవారెవ‌రురా` టీజ‌ర్, పోస్ట‌ర్లు క్యూరియాసిటీ పెంచిన సంగ‌తి తెలిసిందే. ఇత‌ర సినిమాల్లా ఇది రెగ్యుల‌ర్ సినిమా కాద‌ని ప్ర‌శంస‌లు ద‌క్కాయి. త్వ‌ర‌లోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు చిత్ర‌బృందం స‌న్నాహాలు చేస్తోంది. ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ మాటేమిటి? అంటే తాజా స‌మాచారం ప్ర‌కారం.. అగ్ర నిర్మాత కం పంపిణీదారుడు డి.సురేష్ బాబు థియేట్రిక‌ల్ రిలీజ్ రైట్స్ ద‌క్కించుకున్నార‌ని తెలుస్తోంది. ఈ సినిమా కంటెంట్ యూనిక్ గా ఉంది. అందుకే ఆయ‌న చేజిక్కించుకున్నార‌ట‌. ఏపీ- తెలంగాణ స‌హా వ‌ర‌ల్డ్ వైడ్ రైట్స్ ఆయ‌న‌కే చిక్కాయిట‌. ఈ చిత్రానికి న‌వ‌త‌రం ట్యాలెంట్‌ వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో సత్యదేవ్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మన్యం ప్రొడక్షన్స్ పతాకంపై విజయ్ కుమార్ మన్యం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నివేద థామ‌స్ మిత్ర అనే ఓ క్లాసిక్ డ్యాన్స‌ర్ గా న‌టిస్తోంది.
డి.సురేష్ బాబు చేతిలో ప‌డింది కాబ‌ట్టి ఇక ఈ చిత్రానికి ప్ర‌చారం ప‌రంగా.. థియేట్రిక‌ల్ రిలీజ్ ప‌రంగా స‌మ‌స్య‌లు లేన‌ట్టేన‌న్న మాట వినిపిస్తోంది. ఆయ‌న థియేట‌ర్ల‌కు రెంట్లు క‌ట్టే సామ‌ర్థ్యం అవ‌త‌లి వాళ్ల‌కు ఉంటే చాలు.. స‌జావుగా రిలీజ‌వుతున్న‌ట్టే. ఇక జాతీయ అవార్డుల సినిమా పెళ్లి చూపులు ని రిలీజ్ చేసేప్పుడు రాజ్ కందుకూరికి డి.సురేష్ బాబు అండ‌గా నిలిచారు. అయితే థియేట‌ర్ల‌కు రెంట్లు క‌ట్టేందుకు కందుకూరి చాలానే ఆప‌సోపాలు ప‌డ్డారు. ఇక గ‌త ఏడాది ఓ అమెరిక‌న్ నిర్మాత తెర‌కెక్కించిన కేరాఫ్ కంచ‌ర పాలెం చిత్రానికి ప్ర‌చారం ప‌రంగా థియేట‌ర్ల ప‌రంగా డి.సురేష్ బాబు- రానా బాబు అండ‌గా నిలిచారు. ఇప్పుడు `బ్రోచేవారెవ‌రు రా` చిత్రానికి అలాంటి జాక్ పాట్ త‌గిలింద‌న్న ముచ్చ‌టా సాగుతోంది. మ‌రి థియేట‌ర్ల త‌ల‌నొప్పులు .. అడ్వాన్సుల తల‌నొప్పులు లేకుండా చిన్న సినిమాల రిలీజ్ ల‌కు డి.సురేష్ బాబు ఎంత‌వ‌ర‌కూ సాయం చేస్తున్నారు? అన్న‌ది ప‌రిశీలించి చూడాల్సిందే.