అగ్ర‌నిర్మాత టాప్ సీక్రెట్ ఇదీ

Last Updated on by

గ‌త కొద్దిరోజుల క్రితం టాలీవుడ్ అగ్ర‌నిర్మాత డి.సురేష్ బాబు సికింద‌రాబాద్ ప‌రిస‌రాల్లో కార్ యాక్సిడెంట్ చేసిన సంగ‌తి తెలిసిందే. కొంప‌ల్లి నుంచి సికింద‌రాబాద్ వ‌స్తుండ‌గా హోండా యాక్టివాపై వెళుతున్న వారిని సురేష్‌బాబు కార్ గుద్దేసింది. దీంతో ఇద్ద‌రికి స్వ‌ల్ప గాయాలు అవ్వ‌గా, ఒక‌రికి మేజ‌ర్‌గా గాయాల‌య్యాయ‌న్న వార్త‌లు వ‌చ్చాయి. అయితే తాగి డ్రైవ్ చేయ‌డం వ‌ల్ల‌నే ఈ యాక్సిడెంట్ జ‌రిగిందా? నెగ్ల‌జెన్సీ కార‌ణ‌మా? అంటూ ర‌క‌ర‌కాలుగా ప్ర‌చార‌మైంది.

దీనికి డి.సురేష్‌బాబు హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఓ ఇంట‌ర్వ్యూలో క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. ఆ యాక్సిడెంట్ జ‌ర‌గ‌డానికి అస‌లు కార‌ణం కార్ టైర్ అనూహ్యంగా ఓ రాయిపైకి ఎక్కి బ‌ర‌స్ట్ అవ్వ‌డంతో కార్ అదుపు త‌ప్పి ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌ని తెలిపారు. సంఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే తాను పోలీస్ స్టేష‌న్‌కి వెళ్లి బ్రీత్ అన‌లైజ‌ర్ టెస్ట్ చేయించుకున్నాన‌ని తెలిపారు. ఆ ప‌ని చేయ‌డం వ‌ల్ల పోలీసుల‌కు ఓ క్లారిటీ వ‌చ్చింద‌న్నారు. అస‌లు ఘ‌ట‌నకు ముందు ఏం జ‌రిగిందో వివ‌రిస్తూ.. ఆ రోజు కొంప‌ల్లిలో ఉన్న ఫ్రెండు ఇంట్లోని ఓ ఫంక్ష‌న్‌కి వెళ్లాల్సి ఉండ‌గా, తాను అత్తాపూర్‌లోని ఓ థియేట‌ర్‌లో సినిమా చూస్తున్నాన‌ని, ఆ టైమ్‌లో ఫోన్ రావ‌డంతో సినిమా చూస్తున్నాన‌ని చెప్ప‌డం బావుండ‌దు కాబ‌ట్టి, ఆ ఫంక్ష‌న్‌కి అయిష్టంగానే బ‌య‌ల్దేరి వెళ్లాన‌ని సురేష్ బాబు తెలిపారు. అత్తాపూర్‌ని కొంప‌ల్లి వెళ్లి తిరిగి వ‌స్తుండ‌గా ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌ని అన్నారు. యాక్సిడెంట్‌లో గాయ‌ప‌డిన వారంద‌రికీ త‌నే ట్రీట్‌మెంట్‌ని చేయించారు. తీవ్రంగా గాయాలు అయిన వ్య‌క్తికి మాత్రం బెడ్ రెస్ట్ త‌ప్ప‌లేద‌ని, త‌న‌కు ఫిజియో థెర‌పీ కూడా చేయించాన‌ని వెల్ల‌డించారు. ప్ర‌మాదం త‌ర్వాత తాను చేసిన సాయానికి త‌మ ఇంట్లో త‌న ఫోటోనే పెట్టుకున్నార‌ని .. త‌న‌పై వ‌చ్చిన నెగెటివ్ ప్ర‌చారానికి కౌంట‌ర్ వేసారు. ఆరోజు సినిమాకి వెళ్ల‌డానికి కార‌ణం కూడా వేరే ఉంది. ఆ సినిమా బావుంది. త‌ప్ప‌క చూసి తీరాలి అని చెబితే మూవీ బావుంటే రీమేక్ హ‌క్కులు కొనుక్కోవాల‌నే ఆలోచ‌న త‌న‌కు ఉంద‌ని తెలిపారు. అంత క‌థ ఉంద‌న్న‌మాట.

User Comments