సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ టాప్ సీక్రెట్ లీక్

మూవీ మోఘ‌ల్ డి. రామానాయుడు గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. భార‌తీయ భాష‌ల‌న్నింటిలోనూ సినిమాలు నిర్మించిన ఏకైక నిర్మాత‌. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ లో దేశంలో ఉన్న భాష‌ల‌న్నింటిలోనూ సినిమాలు చేసి రికార్డు సృష్టించారు. తెలుగు సినిమా నిర్మాత‌ల‌కు ఆయ‌న గాడ్. ఆయ‌న్ను స్పూర్తిగా తీసుకుని ఎంద‌రో నిర్మాత‌ల‌య్యారు. నేటి త‌రం యువ నిర్మాత‌ల‌కు ఆయ‌న ఆద‌ర్శం. నిర్మాత‌ల ప్ర‌స్తావ‌న వ‌చ్చిందంటే ఆయ‌న పేరు లేకుండా ఏ నిర్మాత నోరు మెద‌ప‌డు. 24 శాఖ‌ల‌పై కమండ్ ఉన్న నిర్మాత. ప్ర‌స్తుతం సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బాధ్య‌త‌ల‌న్నింటిని పెద్ద కుమారుడు సురేష్ బాబు తీసుకున్నారు. తండ్రి వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకుని తండ్రి ఐడియాల‌జీతో సినిమాలు నిర్మిస్తున్నారు.

అయితే సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ లోగోలో ఎస్.పి అనే అక్ష‌రాలు మాత్ర‌మే కాకుండా ఇద్ద‌రు బాలురు కూడా క‌నిపిస్తారు. ఆ ఇద్ద‌రు పిల్ల‌లు ఎవ‌ర‌న్ని విష‌యాన్ని తాజాగా ఓ సంద‌ర్భంలో సురేష్ బాబు తెలిపారు. అందులో ఒక‌రు నేను..మ‌రొక‌రు మా త‌మ్మ‌డు(వెంక‌టేష్) అని టాప్ సీక్రెట్ ను లీక్ చేసారు. పీ అనే లెట‌రుపై నేను..ఎస్ లెట‌ర్ పై మా త‌మ్ముడు నుంచున్నాం. యాధృచ్ఛికంగా పీలెట‌రుకు త‌గ్గ‌ట్టుగానే నేను ప్రొడ్యూస‌ర్ అయ్యాను. మా త‌మ్మ‌డు స్టార్ అయ్యాడు అని తెలిపారు. వాస్త‌వానికి ఇదే విష‌యాన్ని ప‌లు సంద‌ర్భాల్లో వెంక‌టేష్ ను ప్ర‌శ్నించ‌గా చెప్ప‌డానికి విముఖ‌త వ్య‌క్తం చేసారు. ఏనాడు రామానాయుడు కూడా దీనిపై స్పందించింది లేదు. చివ‌రికిలా సురేష్ బాబు లోగో వెనుక సీక్రెట్ నుద ద‌శాబ్ధాల త‌ర్వాత‌ లీక్ చేసారు.