2020 బాబుగారిదేన‌ట‌

గ‌త కొంత కాలంగా చిన్ని చిత్రాల‌కు స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌స్తున్న సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ అధినేతి డి. సురేష్‌బాబు వ‌చ్చే ఏడాది నుంచి సినిమాల ప‌రంగా స్పీడు పెంచ‌బోతున్నారు. గ‌త కొంత కాలంగా సినిమాల నిర్మాణం త‌గ్గించుకున్న ఆయ‌న వ‌చ్చే కొత్త ఏడాదిలో రికార్డు స్థాయిలో వ‌రుస చిత్రాల్ని నిర్మించ‌బోతున్నారు. 2020లో ఆయ‌న నిర్మించ‌బోయే చిత్రాల‌న్నీ క్రేజీ సినిమాలే కావ‌డం ప్ర‌ధానాంశంగా మారింది. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌ సంస్థ నుంచి ఏకంగా అర‌డ‌జ‌ను చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయ‌ని సురేష్ బాబు వెల్ల‌డించారు.

ఇప్ప‌టికే మైథ‌లాజిక‌ల్ చిత్రం `హిర‌ణ్య‌క‌శిప‌` కోసం ప్రీప్రొడ‌క్ష‌న్స్ వ‌ర్క్ ని మొద‌లుపెట్టిన సురేష్ బాబు అన్నిప‌నులు పూర్తి చేశార‌ట‌. ఇది వ‌చ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ల‌నుంది. దీనికి తోడు బాలీవుడ్ హిట్ చిత్రం `డ్రీమ్‌గాళ్‌`ని తెలుగులో రీమేక్ చేయ‌నున్నారు. ఆయుష్మాన్ ఖురానా న‌టించిన ఈ చిత్రం బాలీవుడ్ లో వ‌సూళ్ల వర్షం కురిపించి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. 2019లో ఓ బ్లాక్ బ‌స్ట‌ర్ కొరియ‌న్ చిత్రాన్ని `ఓ బేబీ` పేరుతో రీమేక్ చేసిన సురేష్ బాబు మ‌రో రెండు కొరియ‌న్ చిత్రాల రీమేక్ రైట్స్ ని చేజిక్కించుకున్నార‌ట‌. అవి కూడా ఈ ఏడాదే రిలీజ్ కి రానున్నాయి.

వెంకీతో `అసుర‌న్‌` రీమేక్ చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఇది జ‌న‌వ‌రిలో సెట్స్ పైకి వెళుతోంది. ఇవే కాకుండా బాలీవుడ్ హిట్ మూవీ `సోనూ కె టిటూ కి స్వీటీ` రీమేక్ రైట్స్‌ని సురేష్‌బాబు సొంతం చేసుకున్నారు. దీన్ని ఫిబ్ర‌వ‌రి నుంచి రీమేక్ చేయ‌బోతున్నారు. ఇందులో ఎవ‌రు న‌టిస్తార‌నే విష‌యంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఇవ‌న్నీ అనుకున్న‌ట్టుగా పూర్త‌యితే వ‌చ్చే ఏడాదే ఏకంగా ఆరు చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం ఖాయం. ఇదే జ‌రిగితే 2020 సురేష్‌బాబు నామ సంవ‌త్స‌రం కాబోతుంద‌న్న‌మాటే.