కన్ఫ్యుస్ చేస్తున్న సూర్య

Last Updated on by

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎన్ బి కే అంటే ఏంటో తెలుసు. కానీ ఇప్పుడు ఎన్ జికే అంటున్నాడు సూర్య‌. ఈ టైటిల్ వ‌చ్చి అప్పుడే ఒక రోజు అయిపోయింది. కానీ ఇప్ప‌టికీ ప్రేక్ష‌కుల్లో క‌న్ఫ్యూజ‌న్ మాత్రం తీర‌డం లేదు. అస‌లు ఎన్ జి కే అంటే ఏంటి..? ఈ టైటిల్ కు అర్థ‌మేంటి అంటూ జుట్టు పీక్కుంటున్నారు వాళ్లు. సెల్వ రాఘ‌వ‌న్ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రంలో సూర్య చాలా కొత్త‌గా క‌నిపించ‌బోతున్నాడు. ఈయ‌న పాత్ర చాలా క్రేజీగా ఉంటుంద‌ని తెలుస్తుంది. సాధార‌ణంగా సెల్వ సినిమాల్లో హీరోలు చాలా క్రేజీగా ఉంటారు.. సూర్య‌కు కూడా ఇదే చేయ‌బోతున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. చాలా మంది ఈ సినిమా టైటిల్ గురించి త‌న‌ను అడుగుతున్నార‌ని.. ఎన్ జి కే అంటే ఏంటో చెప్పాల‌ని త‌న‌ను అభిమానులు అడుగుతున్నార‌ని చెప్పాడు సెల్వ రాఘ‌వ‌న్. ఈ టైటిల్ సూర్య పాత్ర పేరు అని చెప్పాడు సెల్వ‌.

ఎన్ జి కే అంటే నంద గోపాల‌న్ కుమ‌ర‌న్ అని తెలుస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు దీని గురించి అఫీషియ‌ల్ క‌న్ఫ‌ర్మేష‌న్ రాలేదు కానీ ఫుల్ ఫామ్ అయితే ఇదే అని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో అతని పాత్ర చాలా వైవిధ్యంగా.. ఛాలెంజింగా ఉంటుందని చెప్పాడు సెల్వ‌. టైటిల్ అంత కొత్త‌గా డిజైన్ చేయ‌డానికి కార‌ణం కూడా అందులో క‌థ ఏంటో చెప్ప‌కూడ‌ద‌నే ఉద్దేశ‌మే అని చెప్పాడు ద‌ర్శ‌కుడు. కాన్సెప్ట్ బ‌య‌ట ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డామ‌ని వివ‌రించాడు సెల్వ రాఘ‌వ‌న్. ఈ సినిమాలో సాయిప‌ల్ల‌వి, ర‌కుల్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. సినిమా ద‌సరాకు విడుద‌ల కానుంది. ఐదు ఫ్లాపుల త‌ర్వాత సూర్య చేస్తోన్న సినిమా ఎన్ జి కే. మ‌రోవైపు సెల్వకు కూడా హిట్లు లేక చాలా ఏళ్ల‌వుతుంది. మ‌రి ఈ ఇద్ద‌రు క‌లిసి ఇప్పుడు ఏం మాయ చేయనుందో..!

User Comments