చిన‌బాబుపై పెద‌బాబు దృష్టి

Last Updated on by

కార్తికి త‌మిళ్ తో పాటు తెలుగులోనూ ఇమేజ్ ఉంద‌నే విష‌యం ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఖాకీ సినిమాతో ఇది ఇంకా పెరిగింది. ఆ సినిమా తెలుగులో కూడా మంచి విజ‌యం సాధించింది. ఇప్పుడు వ‌స్తున్న చిన‌బాబుపై కూడా ఆస‌క్తి బాగానే ఉంది. రైతుల క‌థ‌తో పాండిరాజ్ తెర‌కెక్కించిన ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఇప్పుడు ఈ చిత్ర ఆడియో విడుద‌లైంది. దీనికి సూర్య ముఖ్య అతిథిగా వ‌చ్చాడు.

ఈ సినిమాపై సూర్య చాలా శ్ర‌ద్ధ పెడుతున్నాడు. ఈ చిన‌బాబుతో క‌లిసి పెద‌బాబు కూడా ప్ర‌మోష‌న్స్ కు వ‌స్తున్నాడు. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. ఎందుకంటే ఈ చిత్ర నిర్మాత సూర్య కాబ‌ట్టి. 2డి ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై తొలిసారి త‌మ్ముడితో సినిమా నిర్మించాడు సూర్య‌. ఈ చిత్రం ఖచ్చితంగా తెలుగులోనూ ఆడుతుంద‌ని.. అక్క‌డ ఇక్క‌డ రైతులు ఎక్క‌డైనా రైతులే అంటున్నాడు సూర్య‌. పాండిరాజ్ ఈ క‌థ‌ను అద్భుతంగా తెర‌కెక్కించాడ‌ని చెబుతున్నాడు సూర్య‌. స‌యేషా సైగ‌ల్ హీరోయిన్.

User Comments