గ్యాంగ్ ఉంటే స‌రిపోతుందా సూర్య‌..?

అస‌లే ఈ మ‌ధ్య కాలంలో సరైన విజ‌యం లేక అల్లాడుతున్నాడు సూర్య‌. ఇలాంటి టైమ్ లో ఏరికోరి కొరివితో త‌ల గోక్కుంటారా ఎవ‌రైనా.. కానీ ఇప్పుడు సూర్య మాత్రం ఇదే చేస్తున్నాడు. ఈయ‌న సినిమా తాన సేరంద కూట్టం సంక్రాంతికి విడుద‌ల కానుంది. జ‌న‌వ‌రి 12న ఈ సినిమా విడుద‌ల కానున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే ఈ చిత్ర టీజ‌ర్ త‌మిళ‌నాట విడుద‌లైంది. ఇప్పుడు గ్యాంగ్ టీజ‌ర్ కూడా విడుద‌ల కానుంది. డిసెంబ‌ర్ 13 గ్యాంగ్ టీజ‌ర్ విడుద‌ల‌వుతుంది. ఈ సినిమా హిందీలో వ‌చ్చిన అక్ష‌య్ కుమార్ స్పెష‌ల్ ఛ‌బ్బీస్ ను గుర్తు చేస్తుంది. గ్యాంగ్ విడుద‌ల‌కు ఏ అడ్డంకులు లేవు కానీ మ‌న ద‌గ్గ‌ర సంక్రాంతి ఇప్ప‌టికే ఫుల్ ప్యాక్ అయిపోయింది.

ఇప్ప‌టికే ప‌వ‌న్, బాల‌య్య లాంటి హీరోలంతా రెడీగా ఉన్నారు. వీళ్ల‌ను త‌ట్టుకుని సూర్య గ్యాంగ్ నిల‌బ‌డుతుందా..? సూర్య కెరీర్ కు గ్యాంగ్ కీల‌కం. గ‌త ఏడేళ్ల‌లో సింగం.. సింగం 2 త‌ప్ప మ‌రో హిట్ లేదు ఈ హీరోకు. మొన్నొచ్చిన సింగం 3 కూడా స‌రిగ్గా ఆడ‌లేదు. దాంతో ఇప్పుడు గ్యాంగ్ సినిమాపై భారీ ఆశ‌లే ఉన్నాయి. నానుం రౌడిధానుం త‌ర్వాత విఘ్నేష్ శివ‌న్ చేస్తున్న సినిమా కావ‌డంతో ఈ చిత్రంపై అంచ‌నాలు కూడా భారీగా ఉన్నాయి. కీర్తిసురేష్ హీరోయిన్. తాన సెరేంద కూట్టంలో ప‌క్కా పంచెక‌ట్టుతో ర‌ప్ఫాడిస్తున్నాడు సూర్య‌. మ‌రి తెలుగులో ఈ గ్యాంగ్ చేసే ర‌చ్చ ఎలా ఉంటుందో చూడాలిక‌..!