`సూర్య‌కాంతం` ఫిలింన‌గ‌ర్ టాక్‌

Last Updated on by

నిహారిక కొణిదెల – రాహుల్ విజ‌య్ జంట‌గా న‌టించిన చిత్రం సూర్య‌కాంతం. భెసానియా మ‌రో క‌థానాయిక. ప్ర‌ణీత్.బి ద‌ర్శ‌క‌త్వంలో నిర్వాణ సినిమాస్ సంస్థ నిర్మించింది. ఈనెల 29న సినిమా విడుద‌ల‌వుతోంది. ఇప్ప‌టికే రిలీజైన ట్రైల‌ర్, పోస్ట‌ర్లు ఆక‌ట్టుకున్నాయి. అయితే ఈ సినిమా కాస్త క్లాస్ ట‌చ్ తో ఓ సెక్ష‌న్ ఆడియెన్ కి మాత్ర‌మే ప‌రిమిత‌మా? అన్న సందేహాలు క‌లిగాయి. ఇంకా కెరీర్ ప‌రంగా హిట్ ద‌క్క‌క‌పోయినా నిహారికి తెలివిగా ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది. ఆ క్ర‌మంలోనే ఈ సినిమా అయినా త‌న కెరీర్ తొలి విజ‌యాన్ని అందుకుంటుందా? అంటూ మెగాభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈ సినిమా ఫిలింన‌గ‌ర్ టాక్ ప‌రిశీలిస్తే…

అభి (రాహుల్ విజ‌య్) అనే కుర్రాడిని పెళ్లాడాల్సిందిగా బ‌ల‌వంతం చేస్తారు త‌ల్లిదండ్రులు. ఆ క్ర‌మంలోనే పిల్ల‌ను వెతుక్కునే క్ర‌మంలో కాంతం(నిహారిక‌) తో ప‌రిచయం ఏర్ప‌డుతుంది. కాంతంకు త‌న గ‌తాన్ని నేరేట్ చేస్తున్న క్ర‌మంలో స‌డెన్ గా ఓ రోజు కాంతం మాయ‌మ‌వుతుంది. త‌న త‌ల్లి ఆక‌స్మిక‌ మ‌ర‌ణం అనంత‌రం కాంతం ఎటెళ్లిపోయిందో అత‌డికి తెలీదు. క‌ట్ చేస్తే.. అభి వేరొక కొత్త‌మ్మాయి (భెసానియా) ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఈ ప్రేమికుల మ‌ధ్య అనూహ్య‌మైన ట్విస్టు. సూర్య‌కాంతం రంగ ప్ర‌వేశం చేయ‌డంతో అభి జీవితంలో ఎలాంటి పెను మార్పులు చోటు చేసుకున్నాయి? అన్న‌దే సినిమా కథాంశం. సింపుల్ లైన్.. నావ‌ల్టీ ఉన్న క‌థాంశంతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. సూర్య‌కాంతంగా మెగా డాట‌ర్ నిహారిక న‌ట‌న .. ఫ‌న్ ఎలిమెంట్స్ హైలైట్ గా సాగుతాయి. అయితే ఇది ఏ సెంట‌ర్, మ‌ల్టీప్లెక్సుల‌కు ఓకే అయినా బి, సి కేంద్రాల్లో ఎలా ఎక్కుతుంది? అన్న‌ది ఇప్ప‌టికైతే స‌స్పెన్స్. ఈ సినిమా బిలో యావ‌రేజ్ నుంచి యావ‌రేజ్ అన్న టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాకి ప్రీరిలీజ్ బిజినెస్ ప‌రంగా హైప్ లేదు. ఆడియెన్‌లో ఆశించినంత ఆస‌క్తి లేక‌పోవ‌డం ఓ మైన‌స్ అనే చెప్పాలి.

User Comments