సూర్యకాంతం నిజాయితీ ఇష్టం! భెసానియా

మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల కథానాయికగా, రాహుల్ విజయ్ జంటగా ప్రణీత్.బి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సూర్యకాంతం’. నిర్వాణ సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. మార్చి 29న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సెకెండ్ హీరోయిన్ పెర్లెన్ భెసానియా మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం…

*మీ స్వగతం?
మాది ముంబై. నేను లా విద్యార్థిని. కానీ నటనపై ఇష్టంతో ఈ రంగంలోకి వచ్చాను.

*ఇంతకు ముందు సినిమాలు చేశారా ?
సూర్యకాంతం నా తొలి చిత్రం. కాకపోతే కొన్ని యాడ్స్ లో అలాగే ఫ్రెండ్స్ కోసం ఒకటి రెండు షార్ట్ ఫిలమ్స్ లో చేశాను. అంతకు మించి ఇంకేం అనుభ‌వం లేదు.

*ఈ సినిమాలో ఛాన్స్ ఎలా వచ్చింది ?
నేను ముంబైలో మోడలింగ్ చేశాను. మేనేజర్ ద్వారా సూర్యకాంతం టీమ్ ను కలిసాను. దర్శకుడు ప్రణీత్ నాకు స్టోరీ చెప్పారు. నాకు చాలా బాగా నచ్చింది. ఆ తరువాత ఆడిషన్స్ తీసుకున్నారు. వాళ్ళు అనుకున్న పాత్రలో నేను సరిపోతానని నన్ను ఆ పాత్రకు ఎంపిక చేసుకున్నారు.ఎంపిక చేసే ముందు రాహుల్ కి నాకు ఫోటో షూట్ కూడా చేశారు.

* మీ పాత్ర గురించి?
ఈ సినిమాలో పూజ అనే అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. తానొక సెన్సిటీవ్ గర్ల్. ప్రతి చిన్న విషయానికి పేరెంట్స్ పై డిపెండ్ అవుతుంది. నిజ జీవితంలో నా క్యారెక్టర్ కి సినిమాలో పాత్రకు చాలా వ్యత్యాసం ఉంది.

ఈ సినిమా ముక్కోణ‌పు ప్రేమ‌క‌థా?
లేదండి. కథలో భాగంగా మా పాత్రల మధ్య వచ్చే డ్రామాకి సంబంధించిన కథే తప్ప.. ముక్కోణం కాదు.

నిహారిక గురించి ?
నేను చాలా నిజాయితీగా చెబుతున్నాను. ఒక వ్యక్తిగా నటిగా నిహారిక చాలా జన్యూన్. చాలా కోపరేట్ చేసింది. తనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే రాహుల్ కూడా చాలా బాగా ప్రోత్సహించాడు.

సినిమాలో మీ పాత్రకు నిహారిక పాత్రకు తేడా ఏమిటి ?
చాలా తేడా ఉంది. ఎందుకంటే రెండు పాత్రలు పూర్తి ఆపోజిట్ గా ఉంటాయి.

మీ తదుపరి సినిమాలు?
ఇంకా అంగీక‌రించ‌లేదు. క‌థ‌లు వింటున్నా. సూర్యకాంతం రిలీజ్ తర్వాత స్ప‌ష్ట‌త వ‌స్తుందేమో..

Also Read: Niharika Gets A Clean U