`సూర్య‌కాంతం` మూవీ రివ్యూ

Last Updated on by

నటీనటులు: నిహారిక‌, రాహుల్ విజ‌య్, పెర్లేన్, సుహాసిని త‌దిత‌రులు
బ్యానర్: నిర్వాణ సినిమాస్
స‌మ‌ర్ప‌ణ‌: వ‌రుణ్‌తేజ్
నిర్మాత: స‌ందీప్, సృజ‌న్, రామ్ న‌రేష్‌
రచన: దర్శకత్వం: ప‌్ర‌ణీత్‌.బి
రిలీజ్ తేదీ: 29-03-2019

ముందు మాట:
ప‌ద్ధ‌తైన అమ్మాయి.. బుద్ధిమంతురాలైన అమ్మాయిగా న‌టించ‌మ‌ని నా ద‌గ్గ‌ర‌కు 10 స్క్రిప్టులు వ‌చ్చాయి. ఆ ప‌దిలో ఎనిమిది రొటీన్ స్క్రిప్టులే. మిగ‌తా రెండూ డిఫ‌రెంట్. వాటిలోంచి ఒక‌టి ఎంపిక చేసుకున్నా. ఆ స్క్రిప్టు `సూర్య‌కాంతం` అని నిహారిక కొణిదెల మీడియా ఇంట‌ర్వ్యూల్లో వెల్ల‌డించారు. ప‌ద్ధ‌తైన అమ్మాయిల్లో కాస్త డిఫ‌రెంట్ అమ్మాయిగా నిరూపించుకునే స్క్రిప్టునే ఎంచుకున్నాన‌ని వెల్ల‌డించారు. `నాన్న కూచి` వెబ్ సిరీస్ తెర‌కెక్కించిన ప్ర‌ణీత్.బి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కింది. టీజ‌ర్, ట్రైల‌ర్ లో సూర్య‌కాంతం అభిన‌యం, క్యూట్ ఎక్స్ ప్రెష‌న్స్ ఆక‌ట్టుకున్నాయి. అయితే సినిమా ఆద్యంతం అంత మ్యాట‌ర్ ఉందా లేదా? అన్న‌ది తెలియాలంటే ఈ స‌మీక్ష‌లోకి వెళ్లాల్సిందే.

కథనం అనాలిసిస్:
పూజ (పెర్లెన్ భెసానియా) తో పెళ్లి చూపులకు వెళ్లిన అభి (రాహుల్ విజ‌య్) ఆ త‌ర్వాత త‌న‌కు స్నేహితుడు అవుతాడు. ఆ స్నేహం, ప్రేమ కొన‌సాగుతున్న క్ర‌మంలోనే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని పూజ‌కు చెబుతాడు అభి. ఫ్లాష్ బ్యాక్ లో కాంతం (నిహారిక‌)తో అభి స్నేహం.. అటుపై ఆక‌ర్ష‌ణ‌కు గురై ల‌వ్ ప్ర‌పోజ్ చేసేందుకు ప్ర‌య‌త్నించాన‌ని చెబుతాడు. ఆ క‌థ‌లో కాంతం అత‌డిని ఆట‌ప‌ట్టిస్తుంది. ప్ర‌పోజ‌ల్ కి ఒప్పుకోదు. అంత‌లోనే కాంతం మ‌మ్మీ సుహాసిని ఎంట్రీతో సెంటిమెంట్ ట్రాక్ లోకి వెళుతుంది క‌థ‌. వ‌న్ ఫైన్ డే.. అనారోగ్యంతో సుహాసిని మ‌ర‌ణిస్తుంది. క‌ష్ట‌కాలంలో త‌న వెంటే ఉన్న అభి నుంచి అనూహ్యంగా కాంతం మాయ‌మ‌వుతుంది. అస‌లేమైందో ఎవ‌రికీ తెలీదు. ఆ క్ర‌మంలోనే పూజ‌తో అభి స్నేహం, నిశ్చితార్థం వ‌గైరా చ‌క‌చ‌కా జ‌రిగిపోతాయి. ఇంకేం ఉందిలే ఇంతేగా! అనుకుంటున్న టైమ్ లో స‌రిగ్గా కాంతం తిరిగి అభి జీవితంలో ప్ర‌వేశిస్తుంది. నిన్న ప్రేమిస్తున్నాన‌ని, నువ్వు లేకపోతే నేను లేను! అని అత‌డి వెంట ప‌డుతుంది. అయితే అప్ప‌టికే కాంతంతో త‌న ల‌వ్ గురించి పెర్లిన్ కి చెప్పాడు అభి. కానీ అనూహ్యంగా కాంతం రీఎంట్రీతోనే అస‌లు చిక్కు వ‌చ్చి ప‌డుతుంది. ఈ ముక్కోణ‌పు ప్రేమ‌క‌థ‌లో చివ‌రికి ఎలాంటి ట్విస్టు చోటు చేసుకుంది? అభి పూజ‌నే పెళ్లాడాడా? లేక కాంతంని పెళ్లాడాడా? ఆ ట్విస్టేంటి అన్న‌ది తెలియాలంటే థియేట‌ర్ల‌కు వెళ్లాల్సిందే.

క‌థ ఎంత స‌ర‌ళంగా ఉందో క‌థ‌నాన్ని అంతే నెమ్మ‌దిగా న‌డ‌ప‌డం ఓ పెద్ద మైన‌స్ అనే చెప్పాలి. వ‌రుస‌గా బోరింగ్ స‌న్నివేశాలు థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుడి స‌హ‌నాన్ని ప‌రీక్షించాయి. ముఖ్యంగా ప్ర‌థ‌మార్థం బాగా బోరింగ్. నిహారిక త‌న‌దైన ఎన‌ర్జిటిక్ న‌ట‌న‌తో ఎంత‌గా కాపాడాల‌ని చూసినా.. ఆ ప్ర‌య‌త్నం వృధా ప్ర‌యాసే అయ్యింది.

నటీనటులు- ప్ర‌ద‌ర్శ‌న‌:
ప్ర‌ధాన పాత్ర‌లన్నీ హైలైట్. సూర్య‌కాంతం లాంటి గ్రేషేడ్ ఉన్న పాత్ర‌లో నిహారిక న‌ట‌న ఆక‌ట్టుకుంది. రాహుల్, పెర్లిన్ న‌ట‌న ఫ‌ర్వాలేదు. సుహాసిని సెంటిమెంట్ సీన్స్ య‌థావిధిగానే మెప్పిస్తాయి. రాహుల్ తండ్రిగా శివాజీ రాజా న‌ట‌న ఫ‌ర్వాలేదు. క‌మెడియ‌న్ స‌త్య పాత్ర ఓకే. ఇత‌ర పాత్ర‌లు త‌మ‌దైన శైలిలో ప్ర‌వ‌ర్తిస్తాయి.

టెక్నికాలిటీస్:
నిర్మాణ విలువ‌లు పూర్. ఎంచుకున్న క‌థాంశం రొటీన్ కాబ‌ట్టి ఆ మేర‌కు టెక్నిక‌ల్ గా చెప్పుకునేదేం లేదు. కెమెరా.. సంగీతం ఓకే.

ప్లస్ పాయింట్స్:

* నిహారిక న‌ట‌న‌,
* కొన్ని సీన్ల‌లో ఫ‌న్

మైనస్ పాయింట్స్:

*ఎంచుకున్న క‌థాంశం
* స్లో నేరేష‌న్
* నిర్మాణ విలువ‌లు పూర్

ముగింపు:
`కాంతం` ఫ‌న్నీ గ్లింప్స్ త‌ప్ప ఇంకేదీ లేదు.. ప‌క్కా బోరింగ్..

రేటింగ్:
2.0/5

Also Read : Suryakantam Live Review

User Comments