సౌండ్‌లో సువర్ణసుందరి సీక్రెట్స్‌!

Last Updated on by

సౌండ్‌లో సువర్ణసుందరి సీక్రెట్స్‌!- ఇంద్ర‌

“సువర్ణసుందరి ట్రైలర్ కి అద్భుత‌ స్పందన వచ్చింది. ఈ సినిమా మొదలైనప్పుడు చాలా చిన్న సినిమాగా మొదలై ఇప్పుడు చాలా పెద్ద సినిమా అయింది. ఈచిత్రంలో నటించడం నాకు చాలా ఆనందంగా ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని సెన్సార్కి అప్లైచేశాము. ఈ చిత్రం విడుదలవ్వడానికి అన్ని విధాల రెడీగా ఉన్నాం. ఈ సినిమా ఇంత మంచిగా రావడానికి ప్రధానకారణం సూర్యనే.. “ అని అన్నారు హీరో ఇంద్ర‌. జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లొ తెరకెక్కుతోన్న చిత్రం ‘సువర్ణసుందరి’. ఈ సినిమాను సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా దర్శకుడు సూర్య ఎమ్.ఎస్.ఎన్ తెరమీదకు తీసుకు వస్తున్నారు. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోందన్న ఆసక్తికరమైన శీర్షికతో భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఓ సాంకేతిక అద్భుతంగా ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి రెండవ వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర హీరో ఇంద్రా విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

మీ పాత్ర గురించి…
నా పేరు ఇంద్ర. ఇందులో నేను లీడ్ రోల్లో నటించాను. ఈ చిత్రాని కంటే ముందు నేను వంగవీటిలో నటించాను. రామ్గోపాల్వర్మ్గారి దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రంలో నేను ఒక కీలకమైన పాత్రను పోషించాను. లీడ్ రోల్లో చెయ్యడం ఇదే మొదటిసారి నాకు ఈ అవకాశం కల్పించిన డైరెక్టర్ సూర్యగారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఒక యాక్టర్‌ని నమ్మి ఒక లీడ్ రోల్ ఇవ్వడం అనేది ఈ రోజుల్లో సామాన్యమైన విషయం కాదు. నారోల్ రొమాంటిక్‌గా ఉంటుంది. ఇందులో రెండు స్క్రీన్‌ప్లేలు నడుస్తూ ఉంటాయి. ఒకటి పీరియాడికల్, ఇంకోటి ప్రజంట్. నేను సాక్షికి పెయిర్‌గా చేశాను. ఒక రొమాంటిక్ హీరోగా కనపడతాను. ఈ రెండు స్క్రీన్‌ప్లేల మధ్య నాదొక ఫన్ అండ్ రొమాంటిక్ పాత్ర చాలా బావుంటుంది. డబ్బింగ్ చెప్పినప్పుడు చూస్తే సినిమా చాలా బాగా వచ్చింది. ఇందులో ద్విపాత్రలు చేయ‌లేదు.ఒకే పాత్రలో కనిపిస్తాను. సాక్షి డబుల్ రోల్ చేశారు. నేను ప్రస్తుత జన్మలో ఆమెకు పెయిర్‌గా చేశాను.

డైరెక్టర్ గురించి
సినిమా థియేట్రికల్ ట్రైలర్ చూస్తే మీకు అర్ధమవుతుంది. ఆయన ఎంత బాగా తీశారు అన్నది. సినిమా చాలా బాగా వచ్చింది. పబ్లిసిటీ కూడా చాలా బాగా చేస్తున్నారు. అన్నీ ఆయనే దగ్గరుండి చూసుకుంటున్నారు.

సువర్ణ సుందరి అంటే?
సువర్ణసుందరి అంటే ఒక విగ్రహం.ఆకాలం ఆరు వందల సంవత్సరాల నుంచి ఈ కాలం వరకు కథ ట్రావెల అవుతుంది. దానికి సంబంధించిన సినిమా ఇది.
ఒక సోషియో ఫ్యాంటసీ మూవీ. మైథలాజికల్ కూడా. హైబడ్జెట్ మూవీ అనుకున్నాం కానీ ఇంకా చాలా హై బడ్జెట్ అయింది. సినిమా పైన ప్యాషన్‌తో జనాలు ఆదరిస్తారని నమ్మకంతో సూర్యగారు చేశారు. అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. సాక్షి గురించి…చెప్పాలంటే త‌ను చాలా బాగా చేశారు. తను చాలా సినిమాల్లోనే చేశాను. షూటింగ్ టైంలో నాకు కూడా యాక్టింగ్ పరంగా చాలా హెల్ప్ చేశారు. ఈ సినిమాలో అందరూ చాలా బాగా చేశారు. సాయికుమార్, జయప్రదగారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె నటించిన సినిమాలో చేయడం నా అదృష్టం. జయప్రదగారితో నాకు సీన్స్ ఏమీ లేవు. టెక్నికల్ గా చెప్పాలంటే.. వీఎఫ్‌ఎక్స్ సినిమాకి బాగా కుదిరాయి. గ్రాఫిక్స్ మంచి అనుభూతినిస్తాయి. ఈ చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులు అందరూ పనిమంతులు. సాయికార్తిక్ సంగీతం, మహంతి కెమెరా హైలైట్. ఆర్ ఆర్ చాలా బాగా కుదిరింది. సాంగ్స్ బాగా వచ్చాయి. మంచి సినిమాలు చేసిన ప్రవీణ్‌పూడి ఈ సినిమాకి ఎడిటర్ గా కుదిరారు. ఎక్కడా ఖర్చుకి వెనకాడకుండా భారీ బడ్జెట్ సినిమాలాగా చేశారు. ఈ సినిమాలో అదే ఖర్చు మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది.

నా గురించి ఇదే..
నేను విజయవాడలో పుట్టాను. నేను దాసరి కిరణకుమార్‌కి కజిన్‌ని. రామదూత క్రియేషన్స్ బ్యానర్ మాదే. కాని నేను ఎప్పుడూ నా బ్యాక్‌గ్రాండ్ ఎక్కడ చెప్పకుండానే ఆడిషన్స్‌కి వెళ్ళాను. నేను వంగవీటిలో చేస్తుండగా నాకు సూర్యగారు ఫోన్ చేసి ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు. నట శిక్షణ తీసుకున్నారా అంటే.. మధు ఫిలిం ఇనిస్ట్టిట్యూట్‌లో నేర్చుకున్నాను. స్వర్గీయులు శ్రీరామ్ దగ్గర నేర్చుకున్నాను. నా ఆసక్తితో నేను ప్రాక్టీస్ చేశాను. ఆయన వంగవీటి చేస్తున్నప్పుడు కూడా ఆయనకు నేనెవరో తెలియకుండానే నాకు పాత్రని ఇచ్చారు.

తదుపరి సినిమాలు
రామచక్కని సీత అనే చిత్రంలో చేస్తున్నాను అందులో కూడా లీడ్ రోల్ లో చేస్తున్నాను. ఓంకార్ గారి అసిస్టెంట్ శ్రీహర్ష మండా గారితో చేశాను. ఈ రెండూసినిమాలు డిఫరెంట్ జోనర్స్. 5,6రోజుల్లో షూటింగ్ పూర్తవుతుంది. అది కూడా విడుదలకు దగ్గరలో ఉంది. నన్ను నేను నిరూపించుకోడానికి ఈ రెండు సినిమాలు నాకు మంచి అవకాశాలుగా భావిస్తున్నాను. తాజా చిత్రం మార్చి రెండో వారంలో మీ ముందుకు రాబోతుంది. ఈ సినిమా చూసి నన్ను ఆదరిస్తారని నాకు మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాను.. అని ముగించారు.

User Comments