శ‌త‌జ‌యంతి: సాహో.. ఎస్వీఆర్‌

Last Updated on by

క్లిష్టపాత్రల్లో చతురంగారావు
దుష్టపాత్రల్లో క్రూరంగారావు
హడలగొట్టే భయంకరంగారావు
హాయిగొలిపే టింగురంగారావు
రొమాన్సులో పూలరంగారావు
నిర్మాతల కొంగుబంగారావు
స్వభావానికి ‘ఉంగారంగారావు
కథ నిర్బలం అయితే హావభావాలు పాత్రపరంగారావు
కళ్ళక్కట్టినట్టు కనబడేది ఉత్తి యశ్వీరంగారావు
ఆయన శైలీ ఠీవీ అన్యులకు సులభంగారావు
ఒకోసారి డైలాగుల్లో మాత్రం యమకంగారంగారావు

ఎస్వీఆర్ ప్ర‌తిభ, నైపుణ్యం గురించి ప్రసిద్ధ దర్శకుడు చిత్రకారుడు బాపు వేసిన చిత్రానికి ప్రముఖ రచయిత ముళ్ళపూడి వెంకటరమణ ఇలా చమత్కారంగా వాఖ్యానం రాసారు. కేవ‌లం ఈ ప‌ది లైన్ల‌లోనే విశ్వ‌న‌ట‌చ‌క్ర‌వ‌ర్తి ఎస్వీ రంగారావు ప్ర‌తిభ‌ను అర్థం చేసుకోగ‌లం. తెలుగు సినీచ‌రిత్ర‌లో 300పైగా చిత్రాల్లో ఎన్నో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల్లో జీవించిన ఆయ‌న .. ప్ర‌పంచంలోనే టాప్ 5 న‌టుల‌లో ఒక‌రు అంటే అతిశ‌యోక్తి కాదు. ఘటోత్కచుడు, కీచకుడు, రావణాసురుడుకి ఆయ‌న మ‌రు రూపం. ఈ యుగంలో నటించి ఆ పాత్రలకు ఒక రూపం ఇచ్చారు. ప్రాణం పోశారు. ఎన్నో సాంఘీక చిత్రాల్లో విల‌క్ష‌ణ న‌ట‌న‌తో అబ్బుర‌ప‌రిచారు. ఆయ‌న తెలుగువాడై పుట్ట‌డం ఆయ‌న దుర‌దృష్టం. ఆయ‌న తెలుగువాడై జ‌న్మించ‌డం తెలుగువారి అదృష్టం అని సాటి న‌టుడు గుమ్మ‌డి నాడు ఎంతో ఆవేద‌నతో కూడిన హ‌ర్షం వ్య‌క్తం చేశారంటే అందుకు కార‌ణం లేక‌పోలేదు. స‌మ‌కాలికుల్లో ఏ ఇత‌ర హాలీవుడ్ న‌టుడికి తీసిపోని గొప్ప న‌టుడు. అయితే తెలుగువాడ‌వ్వ‌డం వ‌ల్ల రావాల్సిన గొప్ప‌ గుర్తింపు రాలేదంతే. ద‌టీజ్ ఎస్వీఆర్‌. హ్యాట్సాఫ్ టు హిమ్‌. నేడు ఆయ‌న శ‌త‌జ‌యంతి సంద‌ర్భంగా ఈ ప్ర‌త్యేకం.

User Comments