కాస్టింగ్ కౌచ్ పై స్వాతి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలుగు హీరోయిన్ స్వాతి కాస్టింగ్ కౌచ్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ ఉంద‌ని ఆరోపించింది. ఆ వేంటో ఆమె మాట్లోనే… ప‌రిశ్ర‌మ‌లో దురుద్దేశం ఉన్న వారు ఎవ‌రు డైరెక్ట్ గా అస‌లు విష‌యానికి రారు. ముందు స్నేహం క‌ల‌పుతారు. త‌ర్వాత ముగ్గులోకి దించే ప్ర‌య‌త్నం చేస్తారు. నేను ఒంట‌రిగా ఉన్నాను? నీవు ఫ్రీగానే ఉన్నావా? అంటూ అస‌లు విష‌యానికి వ‌స్తారు. అయితే త‌న‌కు వ్య‌క్తిగ‌తంగా ఇలాంటి అనుభ‌వాలు ఇప్ప‌టివ‌ర‌కూ ఎదురుకాలేదన్నారు. కానీ వ‌చ్చిన అవ‌కాశం నాన్సెన్స్ అనిపిస్తే దాన్ని వ‌దిలేసాన‌ని తెలిపింది. అయితే ఇది అక్క‌డితే పోయే స‌మ‌స్య కాదు. భ‌విష్య‌త్ పైనా ప్ర‌భావం చూపుతుంది. ప‌రిశ్ర‌మ‌లో వాళ్ల‌కున్న ప‌రిచ‌యాల‌తో ఆ అమ్మాయి వేస్ట్? యాక్టింగ్ కి ప‌నికి రాదని నెగిటివ్ ప‌బ్లిసిటీ చేస్తారు. అవ‌కాశం ఇవ్వాల‌నుకున్న వాళ్లు  నిజంగా వేస్ట్ అనుకుంటారు. అలా ఏదో కార‌ణం చెప్పి అవ‌కాశం రాకుండా చేస్తారని స్వాతి ఆరోపించింది.

గ‌తంలో ఇలాంటి సంద‌ర్భాలు ఎదుర్కొన్న కొంత మంది నాతో చెప్పారు. కానీ ఎక్క‌డొ ఒక చోట నిజాయితీ గ‌ల వారు ఉంటారు. వారు కేవ‌లం సినిమా మీద ఫ్యాష‌న్ తోనే ప‌నిచేస్తారు. ఇత‌రుల నుంచి ఏదీ ఆశించ‌రు. అలాంటి వాళ్ల‌తో ప‌నిచేయ‌డం ఎంతో మంచిది. అయినా మ‌న లిమిట్స్ క్రాస్ చేయ‌నంత వ‌ర‌కూ ప‌ర్వాలేదు. దాన్ని క్రాస్ చేస్తేనే స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. నాపై కూడా కొన్ని రూమ‌ర్లు వ‌చ్చాయి. కానీ వాటిని ఎప్పుడూ ప‌ట్టించుకోలేదు. లైంగిక వేధింపులు ఇక్కడే కాదు ప్ర‌తీ చోట ఉన్నాయని స్వాతి ఆరోపించింది. పెళ్లి త‌ర్వాత స్వాతి సినిమాల‌కు దూరంగా ఉంటోన్న సంగ‌తి  తెలిసిందే.