స్వీటీ అనుష్క‌ ఇంట‌ర్నేష‌న‌ల్!!

Last Updated on by

అనుష్క – మాధ‌వ‌న్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న సినిమా సైలెన్స్. అంత‌ర్జాతీయ కాన్వాసుపై రూపొందుతున్న భారీ చిత్ర‌మిది. ఈ సినిమాలో కిల్ బిల్ ఫేం మైఖేల్ మ్యాడ‌స‌న్ న‌టిస్తున్నార‌ని స‌మాచారం. దాదాపు 100 సినిమాల్లో న‌టించిన ఆయ‌న‌ తొలిసారి ఈ ఇండియ‌న్ మూవీలో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్, హిందీ భాష‌ల్లో నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పోరేష‌న్ సంస్థతో క‌లిసి.. టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ న‌టీన‌టుల‌తో ఈ సినిమాని నిర్మిస్తోంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని అల‌రిస్తుంద‌ని నిర్మాత‌లు చెబుతున్నారు. అలాగే ఓ వినూత్నమైన సినిమా చూసామ‌నే ఫీలింగ్ క‌లిగిస్తుంది. ఈ చిత్రానికి హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. అమెరికాలోని సీయోట‌ల్ లో ఏప్రిల్ నుంచి జూన్ వ‌ర‌కు షూటింగ్ చేయ‌నున్నాం. అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ న‌టీన‌టుల‌తో ఈ సినిమాని రూపొందిస్తున్నాం. ఈ మూవీ టీజ‌ర్ ను మేలో గ్రాండ్ గా యు.ఎస్.ఎ లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు. సీయోటెల్ హెడ్ క్వార్టర్స్ గా స్ధాపించిన ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ‌. ఈ సంస్థ టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్, బాలీవుడ్ మ‌రియు హాలీవుడ్ ఇండ‌స్ట్రీల‌లో పలు సినిమాలు నిర్మిస్తోందన్నారు. కిల్ బిల్, హేట్ ఫుల్ ఎయిట్ .. రిస‌ర్వోయ‌ర్ డాగ్స్ చిత్రాల్లో న‌టించిన హాలీవుడ్ స్టార్ మైఖేల్ మ్యాడ‌స‌న్ పాత్ర ఎంతో ప్ర‌త్యేకంగా ఉంటుంద‌ట‌. అనుష్క‌, ఆర్.మాధ‌వ‌న్, సుబ్బరాజు, అంజ‌లి, షాలిని పాండే, అవ‌స‌రాల శ్రీనివాస్ త‌దిత‌రులు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు.