తియ్య‌నైన షాక్ .. స్వీటీ ఇచ్చిన రియ‌ల్ షాక్‌

అన్ని విమ‌ర్శ‌ల‌కు ఒక‌టే స‌మాధానం. ఇన్నాళ్లు త‌న‌ని అన్న నోళ్లు మూసుకునే స‌మాధాన‌మిది. రియ‌ల్ షాక్.. స్ట‌న్నింగ్ మైండ్ బ్లోయింగ్ ఆన్స‌ర్ ఇచ్చింది స్వీటీశెట్టి అలియాస్ అనుష్క శెట్టి. ఈ బెంగ‌ళూరు బాలిక ఇచ్చిన తాజా ట్రీట్ ప్ర‌స్తుతం ఆస‌క్తి రేకెత్తిస్తోంది.
స్వీటీ అనుష్క శెట్టి త‌నని విమ‌ర్శించిన వారికి స‌రైన జ‌వాబు చెబుతున్నారా?  త‌న బ‌రువు విష‌యంలో వ‌చ్చిన రూమ‌ర్ల‌కు చెక్ పెట్టేస్తూ మారిన రూపంతో షాకిస్తున్నారా? అంటే అవున‌నే  అర్థ‌మ‌వుతోంది. స్వీటీ గ‌త కొంత‌కాలంగా విదేశ‌ల్లో ప్ర‌త్యేకించి బ‌రువు త‌గ్గేందుకు ట్రీట్‌మెంట్ తీసుకున్నార‌ని, నేచురోప‌తి విధానం ద్వారా బ‌రువు త‌గ్గే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ప్ర‌చార‌మైంది. అనుష్క రిలీజ్ చేసిన తాజా ఫోటో చూశాక షాక్ తిన‌డం అభిమానుల వంత‌య్యింది. ఈ కొత్త ఫోటో చూశాక స్వీటీ ఇలా రివెంజ్ తీర్చుకుందంటూ అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. మారిన కొత్త రూపంతో అనుష్క త‌దుప‌రి  కోన వెంక‌ట్ నిర్మించే చిత్రంలో న‌టిస్తార‌ని ప్ర‌చారం సాగుతోంది.