మెగాస్టార్ స‌ర‌స‌న స్వీటీ

Last Updated on by

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా `సైరా- న‌ర‌సింహారెడ్డి` తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇది చిరు కెరీర్ 101వ సినిమా. ఈ క్రేజీ హిస్టారిక‌ల్ వారియ‌ర్ చిత్రం సెట్స్‌పై ఉండ‌గానే, త‌దుప‌రి102వ సినిమా చేసేందుకు మెగాస్టార్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసిన సంగ‌తి తెలిసిందే. కొర‌టాల శివ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఆగ‌స్టు 22న చిరు పుట్టిన‌రోజు కానుక‌గా లాంఛ‌నంగా ప్రారంభం కానుంది. అటుపై ప్రీప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ పూర్తి చేసి, 2019లో రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ‌కు వెళ్ల‌నున్నారు. అప్పటికి మెగాస్టార్.. సైరా చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని కొర‌టాల‌కు అందుబాటులోకి వ‌స్తార‌ట‌. ఆ మేర‌కు త‌దుప‌రి స‌న్నాహ‌కాలు సాగుతున్నాయ‌ని తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్టులో క‌థానాయిక ఎవ‌రు? అంటే.. దానికి క్లారిటీ వ‌చ్చేసింద‌న్న‌ది తాజా అప్‌డేట్.

మెగాస్టార్ న‌టించే 102వ సినిమా కొర‌టాల బ్రాండ్ సామాజిక క‌థాంశంతో ఉంటుందిట‌. ఇందులో రాజ‌కీయాల‌కు ఆస్కారం ఉంద‌ని ఇదివ‌ర‌కూ ప్ర‌చార‌మైంది. ఇలాంటి సినిమాలో క‌థానాయిక ఎంతో ప‌రిణ‌తితో న‌టించాల్సి ఉంటుంది. ఆ పాత్ర ప‌రిధి పెద్ద‌దిగా ఉంటుంది. అందుకు త‌గ్గ‌ట్టే స్వీటీ అనుష్క అయితే బావుంటుంద‌ని కొర‌టాల భావించి సంప్ర‌దించార‌ట‌. ఆల్మ‌స్ట్ అనుష్క ఫైన‌ల్ అయిన‌ట్టేన‌ని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డాల్సి ఉందింకా. లాంచింగ్ డే.. కొర‌టాల & టీమ్‌ స్వ‌యంగా ప్ర‌క‌టిస్తారేమో చూడాలి.

User Comments