స్వీటీ చివ‌రికి మిగిలేది?

Last Updated on by

స్వీటీ అనుష్క శెట్టి గ‌త కొంత‌కాలంగా సినిమాల‌కు దూర‌మైన సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే మీడియా ర‌క‌ర‌కాల క‌థ‌నాల్ని ప్ర‌చురించింది. స్వీటీకి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నార‌ని, పిల్లాడు స‌రిగా కుద‌ర‌క కాళ‌హ‌స్తి వెళ్లి కాల‌స‌ర్ప‌దోష నివార‌ణ పూజ‌లు నిర్వ‌హించార‌ని, అలానే త‌న బ‌రువు త‌న‌కు శాపం అవ్వ‌డంతో అది త‌గ్గించుకునేందుకు నానా ప్ర‌యాస‌లు ప‌డుతోంద‌ని అనుష్క‌పై ఉన్న‌వి లేనివి ప్ర‌చారం అయ్యాయి.

ఆ క్ర‌మంలోనే స్వీటీ మీడియాపైనా రుస‌రుస‌లాడేయ‌డం చ‌ర్చ‌కొచ్చింది. ఒకానొక సంద‌ర్భంలో త‌న వ్య‌క్తిగ‌త విష‌యాల‌న్నీ బ‌య‌ట‌కు లీక్ చేస్తున్న ప‌ర్స‌న‌ల్ టీమ్‌ని మార్చేసింద‌ని, క్లీన్ చేసి ప్ర‌శాంత జీవ‌నం సాగిస్తోంద‌ని కొత్త‌ర‌కం క‌థ‌నాలు వ‌చ్చాయి. ఇక‌పోతే `భాగ‌మ‌తి` త‌ర్వాత స్వీటీ వేరొక సినిమాకి క‌మిట‌వ్వ‌క‌పోవ‌డంతో అస‌లేం జ‌రుగుతోందో అర్థం గాక జ‌నం క‌న్ఫ్యూజ‌న్‌లో ఉన్నారు. ఇప్ప‌టికీ స్వీటీ ప్రాజెక్టు ఖ‌రారు చేయ‌క‌పోవ‌డంతో ఒక‌టే ఇదిగా ఉన్నారంతా. ఆ క్ర‌మంలోనే అనుష్క బ‌రువు త‌గ్గేందుకు ఆస్ట్రియా వెళుతోంద‌ని, అక్క‌డ‌ నేచుర‌ల్ వేలో బ‌రువు త‌గ్గించే క్లినిక్ ఉంద‌ని కొత్త ప్ర‌చారం మొద‌లైంది. అనుష్క అన్నిర‌కాలుగా ఫిట్ నెస్ కోసం ప్ర‌య‌త్నిస్తోంది. బ‌రువు త‌గ్గేందుకు చాలానే చేసింది. చివ‌రి ప్ర‌య‌త్నంగా ఆస్ట్రియా వెళుతోందంటూ ప్ర‌చారం సాగుతోంది. ప్ర‌పంచంలోనే ది బెస్ట్ క్లినిక్ ఆస్ట్రియాలో ఉంది. అక్క‌డైతే రిజ‌ల్ట్స్ బాగా వ‌స్తున్నాయిట‌. 37ఏళ్ల అనుష్క‌కు ఈ క్లినిక్ మార్పు చూపిస్తుంద‌ని ఎవ‌రో స‌ల‌హా ఇచ్చార‌ట‌. ప‌లువురు బాలీవుడ్ స్టార్లు ఇక్క‌డ ఒబేసిటీ ట్రీట్‌మెంట్ తీసుకోవ‌డంతో అనుష్క కూడా ప్రిఫ‌ర్‌ చేస్తోంద‌న్న మాటా వినిపిస్తోంది. ఇంత‌కీ అట్నుంచి వ‌చ్చాక అయినా స్వీటు లాంటి వార్త చెబుతుందేమో?

User Comments