`సైరా` అనే మెగా మ‌ల్టీస్టార‌ర్‌

Last Updated on by

స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు `ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి` జీవిత‌క‌థ ఆధారంగా `సైరా` తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో టైటిల్ పాత్ర‌లో మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్నారు. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడు. చ‌ర‌ణ్ నిర్మాత‌. అమితాబ్ బ‌చ్చ‌న్‌, విజ‌య్‌సేతుప‌తి, న‌య‌న‌తార‌, త‌మ‌న్నా, సుదీప్, ర‌వికిష‌న్ వంటి స్టార్లు న‌టిస్తున్నారు. ఇరుగు పొరుగు భాష‌ల న‌టీన‌టుల‌తో ఈ చిత్రం భారీ మ‌ల్టీస్టార‌ర్‌గా మారింది. అయితే ఈ ప్రాజెక్టును అంత‌కుమించి కొత్త కోణంలో చూడాల్సిన స‌న్నివేశం ప్ర‌స్తుతం క‌నిపిస్తోంది.

`సైరా`ను ఇన్నాళ్లు మ‌ల్టీస్టార‌ర్ అని స‌రిపెట్టుకున్నాం. తాజా స‌న్నివేశాన్ని బ‌ట్టి ఇదో మెగా గిగా మ‌ల్టీస్టార‌ర్ అని ఫిక్స‌వ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమాలో ఏకంగా ముగ్గురు న‌లుగురు మెగా హీరోలు న‌టించ‌నున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది. ముఖ్యంగా `సైరా`లో అల్లు అర్జున్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌ని .. నీహారిక‌కు అవ‌కాశ‌మిచ్చార‌ని ప్ర‌చారం సాగుతోంది. తామ‌ర‌తంప‌ర‌గా పుట్టుకొస్తున్న ఈ ప్ర‌చారంలో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, అల్లు శిరీష్ పేర్లు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజ‌మైతే క‌చ్ఛితంగా ఈ సినిమాని మెగా గిగా మ‌ల్టీస్టార‌ర్ అని ఫిక్స‌వ్వొచ్చు. అల్లు అర్జున్ ఇదివ‌ర‌కూ మెగాస్టార్ న‌టించిన డాడీ, శంక‌ర్ దాదా జిందాబాద్ చిత్రాల్లో త‌ళుక్కున మెరిశాడు. ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడోసారి మావ‌య్య‌తో న‌టించే ఛాన్స్ కొట్టేసిన‌ట్టే. అయితే బ‌న్ని పాత్ర `రుద్ర‌మ‌దేవి`కి ప్ల‌స్ అయిన‌ట్టు `సైరా`కి అంతే పెద్ద‌గా క‌లిసొస్తుందేమో చూడాలి. మ‌రోవైపు `సైరా`లో ఛాన్స్ కావాల‌ని నిహారిక `చ‌ర‌ణ్ అన్న కాళ్లు ప‌ట్టుకున్నా` అని అన‌డంతో ఇక కాద‌ని ఎలా అంటాడు! అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈ ప్రాసెస్ వెరీ ఇంట్రెస్టింగ్‌. అంత‌మంది మెగా పెర్ఫామ‌ర్స్‌ని తెర‌పై వీక్షించే స‌ద్భాగ్యం మెగాభిమానుల‌కు క‌ల‌గ‌నుండ‌డం ఆస‌క్తి రేకెత్తించేదే. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లో ఈ సినిమాని చిత్రీక‌రిస్తున్నారు. 2019 వేస‌విలో సినిమా రిలీజ్ కానుంది.

User Comments