సైరా పోస్ట‌ర్: బిగ్‌బికి మెగా గిఫ్ట్

Last Updated on by

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న భారీ హిస్టారిక‌ల్ చిత్రం `సైరా-న‌ర‌సింహారెడ్డి`. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడు. సురేఖ కొణిదెల స‌మ‌ర్ప‌ణ‌లో కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీ ప‌తాకంపై రామ్‌చ‌ర‌ణ్ నిర్మిస్తున్నారు. అన్ని ప‌రిశ్ర‌మ‌ల న‌టీన‌టుల‌తో అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ ఇది. ప్ర‌స్తుతం జార్జియాలో మెగాస్టార్‌పై భారీ యాక్ష‌న్ దృశ్యాల్ని చిత్రీక‌రిస్తున్నారు. అక్క‌డ సుదీర్ఘ‌మైన షెడ్యూల్‌లోనూ చిరు పాల్గొంటున్నారు.

ఈ సినిమాని 2019 సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేస్తార‌ని మెగాభిమానులు భావించినా, భారీ విజువ‌ల్ ఎఫెక్ట్స్‌, గ్రాఫిక్స్ వ‌ర్క్‌తో ముడిప‌డిన ప్రాజెక్ట్ కాబ‌ట్టి కాస్త ఆల‌స్యంగానే రిలీజ‌వుతోంది. వేస‌వి సెల‌వుల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు చ‌ర‌ణ్ స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. ఇటీవ‌లే మెగ‌స్టార్ చిరంజీవి బ‌ర్త్‌డేకి రిలీజ్ చేసిన `సైరా` టీజ‌ర్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న మెగాభిమానుల్ని ఆక‌ట్టుకుంది. తాజాగా బిగ్‌బి అమితాబ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఈ చిత్రంలో అమితాబ్ గెట‌ప్‌ని రివీల్ చేస్తూ మోష‌న్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేశారు. అమితాబ్ రాజ‌గురువు గెట‌ప్‌ని రివీల్ చేశారు. ఈ గెట‌ప్‌లో అమితాబ్ గంభీర‌మైన రూపం మైమ‌రిపించింది. రీరికార్డింగ్ ఆక‌ట్టుకుంది. బిగ్‌బికి మెగా గిఫ్ట్ ఇది. మ‌రోవైపు 76 వ‌య‌సు అమితాబ్ ఈరోజును చాలా సింపుల్‌గా ఎలాంటి హంగామా లేకుండానే గ‌డిపేస్తున్నార‌ని తెలుస్తోంది.

User Comments