సైరా ఈవెంట్ లైవ్…షాకింగ్ ఛాన‌ల్

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయకుడిగా న‌టిస్తోన్న సైరా న‌ర‌సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ నేటి సాయంత్రం హైద‌రాబాద్ లో జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. కార్య‌క్ర‌మానికి పెద్ద ఎత్తున అతిధులు హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంది. ముఖ్యంగా సినీ రాజ‌కీయ ప్ర‌ముఖులు త‌ప్ప‌నిస‌రిగా విచ్చేయ‌నున్నారు. దీనిలో భాగంగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంది. అయితే ఈవెంట్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సార హ‌క్కుల‌ను సాక్షి, జెమినీ మ్యూజిక్ ద‌క్కించుకున్నాయి.

సాయంత్రం జ‌ర‌గ‌బోయే మొత్తం ఈవెంట్ ను ఆ రెండు ఛానెల్స్ క‌వ‌ర్ చేయ‌నున్నాయి. అయితే ప‌వ‌న్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి సాక్షి ఆయ‌న కార్య‌క్ర‌మాల‌ను క‌వ‌ర్ చేయ‌డం లేదు. ఇటీవ‌ల కాలంలో ప‌వ‌న్ విష‌యంలో మ‌రింత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఈ మ‌ధ్య కాలంలో సాక్షి దిన ప‌త్రిక‌లో ఆయ‌న ఫోటోల‌ను స్కిప్ చేయ‌డం హాట్ టాపిక్ గా మారింది. ఈ నేప‌థ్యంలో చిరంజీవి, నిర్మాత రామ్ చ‌ర‌ణ్ స‌ద‌రు ఛాన‌ల్ కు నేటి సాయంత్రం జ‌రిగే ఈవెంట్ రైట్స్ ఇవ్వ‌డం షాకింగ్ అనే చెప్పాలి. ఇన్నాళ్లు ప‌వ‌న్ ని విబేధించిన స‌ద‌రు ఛాన‌ల్ నేడు ముఖ్య అతిధిగా వ‌స్తోన్నఈవెంట్ ను ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌డం విశేషం.