సైరా ప్రీ రిలీజ్ వాయిదా! కొత్త తేదీ ఇదేనా?

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన సైరా న‌ర‌సింహారెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్ ని ఈనెల 18న హైద‌రాబాద్ లోని ఎల్. బి స్టేడియంలో అభిమానుల స‌మ‌క్షంలో వైభ‌వంగా నిర్వ‌హిస్తున్న‌ట్లు కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ అతిథుల‌తో స‌హా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో ఈవెంట్ వాయిదా ప‌డిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

నేడు మాజీ స్పీక‌ర్ కోడెల ఆత్మ‌హ‌త్య‌, గోదావ‌రిలో ప‌డ‌వ‌ మునక వంటి సంఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో వాయిదా వేసిన‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లొస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో కొత్త తేదీ కూడా తెర‌పైకి వ‌చ్చింది. నాలుగు రోజుల పాటు వాయిదా వేసి ఇదే నెల 22 నిర్వ‌హించాల‌ని ప్లాన్ చేస్తున్నారుట‌. అయితే ట్రైల‌ర్ మాత్రం 18వ తేదీన రిలీజ్ కానుంద‌ని అంటున్నారు. మ‌రి ఈవెంట్ వాయిదా ప‌డిందా? లేదా? అన్న‌ది కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ అధికారికంగా ప్ర‌కటిస్తే గానీ క్లారిటీ రాదు. ఈ విష‌యంపై ప్ర‌స్తుతం మెగా అభిమానుల్లో ఉత్కంఠ నెల‌కొంది.