సైరా శాటిలైట్ షాకింగ్ రేటు

ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ సైరా న‌ర‌సింహారెడ్డి ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్ప‌టికే పెద్ద ఎత్తున జ‌రిగింది. తెలుగు రాష్ర్టాలు స‌హా ఓవ‌ర్సీస్ లోనూ క‌ళ్లు చెదిరే ధ‌ర‌కు అమ్ముడుపోయింది. అమోజాన్ ప్రైమ్ 40 కోట్ల‌కు పైగా వెచ్చించి డిజిట‌ల్ స్ర్టీమింగ్ రైట్స్ ను ద‌క్కించుకున్న‌ట్లు టాక్ ఉంది. తాజాగా సైరా శాటిలైట్, డిజిట‌ల్ రైట్స్ ను ప్ర‌ముఖ ఛాన‌ల్ జీటీవీ భారీ మొత్తం చెల్లించి ద‌క్కించుకున్న‌ట్లు ఫిలిం స‌ర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. అన్ని భాష‌ల‌కు క‌లిపి మొత్తం 125 కోట్లు చెల్లించిన‌ట్లు స‌మాచారం.

దీంతో అన్ని చోట్లా సైరా హాట్ టాపిక్ అవుతోంది. ఆ ర‌కంగా రిలీజ్ కు ముందే సైరా రికార్డుల వేట మొద‌లుపెట్టింద‌ని జోస్యం చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ లెజెండ్ అమితాబ‌చ్చాన్, విజ‌య్ సేతుప‌తి, సుదీప్, న‌య‌న‌తార‌, త‌మ‌న్నా లాంటి టాప్ సెల‌బ్రిటీలు క‌లిసి న‌టించిన సినిమా కావ‌డంతోనే మార్కెట్ లో ఇంత ధ‌ర‌కు అమ్ముడుపోయిన‌ట్లు తెలుస్తోంది. ఈచిత్రాన్ని మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ 270 కోట్ల‌తో నిర్మించిన సంగ‌తి తెలిసిందే. అక్టోబ‌ర్ 2న సినిమా విడుద‌ల‌వుతుంది.