బ్లాక్ బ‌స్ట‌ర్‌ని మోసం చేసిన ఫ్లాప్ క‌లెక్ష‌న్స్

ఓవైపు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అన్న టాక్ వ‌చ్చిన సినిమా క‌లెక్ష‌న్లు ట్రేడ్ పండితుల్ని విస్మ‌య‌ప‌రుస్తున్నాయి. సేమ్ టైమ్ డిజాస్ట‌ర్.. అట్ట‌ర్ ఫ్లాప్.. ఫ‌ర్వాలేదు అన్న సినిమాల క‌లెక్ష‌న్స్ అంతే ఇదిగా ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి. ఇటీవ‌లే రిలీజైన ఓ మూడు భారీ చిత్రాల ఫ‌లితం ట్రేడ్ విశ్లేష‌కుల‌కు షాక్‌నిస్తోంది.
ప్ర‌భాస్ న‌టించిన సాహో, హృతిక్ -టైగ‌ర్ న‌టించిన వార్, మెగాస్టార్ చిరంజీవి న‌టించిన వార్ చిత్రాల రిజ‌ల్ట్ ప‌రిశీలిస్తే ఈ సంగ‌తి అర్థ‌మ‌వుతోంది.

డార్లింగ్ ప్ర‌భాస్ న‌టించిన `సాహో` డిజాస్ట‌ర్ అంటూ తొలిరోజు టాక్ వ‌చ్చింది. స‌మీక్ష‌కులు ఈ చిత్రంపై నెగెటివ్ రివ్యూలతో చెల‌రేగినా ఆ ప్ర‌భావం క‌లెక్ష‌న్స్ పై ఏమాత్రం చూపించ‌లేదు. బాహుబ‌లి స్టార్ గా ప్ర‌భాస్ మానియా ఓ రేంజులో సాగింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 70శాతం రిక‌వ‌రీతో ఫ‌ర్వాలేద‌నిపించినా.. హిందీ బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సాధించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా సుమారు 200 కోట్ల మేర షేర్ వ‌సూలు చేసింద‌ని ప్ర‌చార‌మైంది.

ఇక హృతిక్‌ రోషన్‌- టైగర్‌ ష్రాఫ్‌ కాంబినేషన్ యాక్షన్ మూవీ వార్ కి యావ‌రేజ్ అన్న టాక్ వ‌చ్చింది. అస‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ అన్న టాక్ రాకుండానే ఈ చిత్రం 200 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ముదులిపింది. ఓవైపు బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ సైరా హిందీలో ఆడుతున్నా.. వార్ పై ఆ ప్ర‌భావం ఏమాత్రం క‌నిపించ‌లేదు. ఇక వార్ దెబ్బ‌కు అంత గొప్ప మూవీ అని క్రిటిక్స్ ప్ర‌శంసించినా సైరా హిందీ బాక్సాఫీస్ వ‌ద్ద చ‌తికిల‌బ‌డి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఉత్త‌రాదిన‌ ఆశించిన ఫ‌లితం ద‌క్క‌క‌పోవ‌డం కొణిదెల కాంపౌండ్ ని నిరాశ‌ప‌రిచింది.

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన సైరా చిత్రానికి బాలీవుడ్ క్రిటిక్స్ స్టాండింగ్ ఒవేష‌న్ ఇచ్చారు. ఇప్ప‌టికీ ఉత్త‌రాదిన ఈ సినిమా వీక్షించిన జ‌నం ఒక గొప్ప సినిమా చూశామ‌ని మీడియా ముందు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. అయితే వ‌సూళ్లు మాత్రం తీసిక‌ట్టుగా ఉన్నాయి. బ్లాక్ బ‌స్ట‌ర్ అయినా ఒక ద‌క్షిణాది సినిమా అనే చిన్న చూపు ఉత్త‌రాదిన క‌నిపించింది. ఇక్క‌డ గొప్ప స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు అయినా అక్క‌డ క‌నెక్ట‌వ్వ‌లేదు. మ‌ద‌రాసీలు అని లైట్ తీస్కోవ‌డం హిందీ మార్కెట్లో క‌నిపించింది. సైరా చిత్రాన్ని కేవ‌లం తెలుగు రాష్ట్రాల వ‌సూళ్లు మాత్ర‌మే ఆదుకున్నాయి. ఇక్క‌డ మాత్రం సైరా బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం అందుకుంద‌నే చెప్పాలి. అటు హిందీ, త‌మిళం స‌హా ఇత‌ర భాష‌ల్లో నిరాశ‌ప‌రిచింది.