ఇంత‌కీ సైరా మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎవ‌రు..?

Last Updated on by

షూటింగ్ మొద‌లైపోయింది.. రెగ్యుల‌ర్ షూటింగ్ వేగంగా జ‌రుగుతుంది.. చిరంజీవి కూడా సైరా సెట్ లో జోష్ గా ఉన్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒక్క ప్ర‌శ్న‌ మాత్రం అభిమానుల‌ను బాగా తొలిచేస్తుంది. అదే సైరా సినిమాకు సంగీత ద‌ర్శ‌కుడు ఎవ‌రు..? ఏఆర్ రెహ‌మాన్ ఉన్న‌ట్లుండి ఈ చిత్రం నుంచి త‌ప్పుకోవ‌డంతో అస‌లు స‌మ‌స్య మొద‌లైంది. ఈయ‌న త‌ప్పుకున్న త‌ర్వాత షూటింగ్ మొద‌లుపెట్టారు కానీ సంగీత ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌నే విష‌యం మాత్రం చెప్ప‌లేదు. సినిమాటోగ్ర‌ఫ‌ర్ ర‌వివ‌ర్మ‌న్ త‌ప్పుకోగానే ర‌త్న‌వేలును రీప్లేస్ చేసిన టీం.. మ్యూజిక్ డైరెక్ట‌ర్ విష‌యంలో ఏ నిర్ణ‌యం తీసుకోలేక‌పోతున్నారు చిత్ర‌యూనిట్.

థ‌మ‌న్ అనుకున్నా కూడా ఇంత పెద్ద సినిమాను ఆయ‌న హ్యాండిల్ చేయ‌లేడ‌నే టాకే ఎక్కువ‌గా వినిపిస్తుంది. అందుకే మెగా ఫ్యామిలీ కూడా థ‌మ‌న్ వైపు వెళ్ల‌క‌పోవ‌డ‌మే మంచిద‌నుకుంటున్నారు. దేవీ శ్రీ ప్ర‌సాద్ కూడా హిస్టారిక‌ల్ మూవీస్ కు స‌రైన వ్య‌క్తి కాదేమో అనే వాద‌న వినిపిస్తుంది. ఆ మ‌ధ్య కీర‌వాణిని కూడా అనుకున్నా ఆయ‌న్ని కూడా మెగా ఫ్యామిలీ వ‌ద్ద‌నుకుంది. దాంతో ఇప్పుడు మ‌రో మ్యూజిక్ డైరెక్ట‌ర్ కోసం వేట సాగిస్తున్నారు. బాలీవుడ్ నుంచే ఒక‌ర్ని తీసుకురావాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నాడు చిరంజీవి. అలా చేస్తే అక్క‌డ ఇంకా మార్కెట్ పెరుగుతుందని ఆయ‌న అంచ‌నా. మ‌రి ఇవ‌న్నీ ఎప్ప‌టికి పూర్త‌య్యేనో.. సైరాకు మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎప్ప‌టికి సెట్ అయ్యేనో చూడాలిక‌..!

User Comments