చిరు ప‌ని అడ్డుకుంటున్న వ‌రుణ్

Last Updated on by

వ‌రుణ్ తేజా.. మెగా వార‌సుడు వ‌రుణ్ తేజా త‌న పెద‌నాన్న ప‌నులకు అడ్డు ప‌డుతున్న‌ది..? అస‌లు ఆయ‌న్ని చూస్తేనే వ‌ణికిపోతారు మెగా హీరోలు.. అలాంటిది చిరంజీవి చేసే ప‌నికి ఎలా అడ్డు ప‌డ్డాడు అనుకుంటున్నారా..? అయితే ఇక్క‌డ వ‌రుణ్ అంటే హీరో కాదు.. వ‌రుణ దేవుడు.. వ‌ర్షం. కొన్ని రోజుల నుంచి హైద‌రాబాద్ లో ఎడ‌తెరిపి లేని వ‌ర్షాలు ప‌డుతున్నాయి. ఇదే ఇప్పుడు చిరంజీవికి చింత‌ను తీసుకొస్తుంది. ఈయ‌న న‌టిస్తున్న సైరా షూటింగ్ సిటీలోనే కోకాపేట్ లోని ప్ర‌త్యేకంగా వేసిన సెట్ లో జ‌రుగుతుంది. అక్క‌డే నైట్ ఎఫెక్ట్ లో సీన్స్ చిత్రీక‌రిస్తున్నాడు ద‌ర్శ‌కుడు. ఇవి బాగా రావాలంటే వాతావ‌ర‌ణం కూడా స‌హ‌క‌రించాలి. కానీ వ‌రుణ దేవుడు సైరా టీంపై ప‌గ బ‌ట్టిన‌ట్లు రోజూ వ‌స్తున్నాడు.
దాంతో షెడ్యూల్ ఆగిపోయింది.

చిన్న బ్రేక్ ఇచ్చినా కూడా చాలా మంది స్టార్ క్యాస్ట్ ఇందులో ఉండ‌టంతో ప్ర‌భావం భారీగా ప‌డుతుంది. ఒకేసారి మ‌ళ్లీ అంత‌మంది డేట్స్ దొర‌క‌డం కాస్త‌ క‌ష్ట‌మే. అందుకే వ‌ర్షం త‌గ్గిన వెంట‌నే మ‌ళ్లీ ఆల‌స్యం చేయ‌కుండా షూటింగ్ మొద‌లు పెట్టాల‌ని చూస్తున్నాడు ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి. పరిస్థితులు చూస్తుంటే మ‌రో మూడు నాలుగు రోజుల వ‌ర‌కు కూడా సైరా షూటింగ్ మొద‌ల‌య్యేలా క‌నిపించ‌డం లేదు. న‌య‌న‌తార‌తో పాటు త‌మ‌న్నా కూడా ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. అస‌లే షూటింగ్ లేట్ అవుతుంద‌నే వార్త‌లొస్తున్న త‌రుణంలో ఇలా వ‌ర్షం అడ్డుప‌డ‌టంతో చిరు అస‌హ‌నంతో ఊగిపోతున్నాడు.

User Comments